Airtel Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. హైస్పీడ్ డేటా, కాలింగ్‌తో చౌకైన రీఛార్జ్ ప్లాన్లు ఇవే.. ఫుల్ లిస్ట్ మీకోసం..!

Airtel Plans : ఎయిర్‌టెల్ డేటా, ఫోన్ కాల్స్ అందించే రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఇందులో మీకు నచ్చిన రీఛార్జ్ ప్లాన్ ఎంచుకోవచ్చు.

Airtel Recharge Plan

Airtel Plans : ఎయిర్‌టెల్ యూజర్ల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్ రూ. 300 లోపు ఉన్న ఈ ప్లాన్‌లన్నీ డేటా, కాలింగ్‌ బెనిఫిట్స్ అందిస్తాయి.

ఎయిర్‌టెల్ నంబర్‌ సెకండరీ సిమ్ వాడే యూజర్లకు ఈ ప్లాన్లు బెస్ట్. ఈ లిస్టులో ఎయిర్‌టెల్ అందించే ఏ ప్లాన్‌ల ధరలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..

Read Also : EPFO :ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఇంటర్నెట్ లేకుండానే PF బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..!

ఎయిర్‌టెల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లు :
ఎయిర్‌టెల్ సిమ్‌ను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుకోవాలంటే ఎక్కువ ఖర్చు చేయకూడదని భావిస్తే ఎయిర్‌టెల్ ప్రస్తుతం రూ. 300 కన్నా తక్కువ ధరకే 4 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. బడ్జెట్ యూజర్లకు ఈ రీఛార్జ్ ప్లాన్లు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

ఎయిర్‌టెల్ రూ. 300 లోపు ప్లాన్లు :
ఎయిర్‌టెల్ రూ.300 లోపు ప్లాన్‌ల ధరలు రూ.199, రూ.219, రూ.249, రూ.299. ఈ ప్లాన్‌లు ఏవీ అన్‌లిమిటెడ్ డేటా లేదా 5G యాక్సెస్‌ అందించే ఈ ప్లాన్‌లు ప్రాథమిక అవసరాలకు సరిపోతాయి.

ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్ :
ఎయిర్‌టెల్ అత్యంత చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్. గతంలో రూ.155, ఆ తరువాత రూ.179కి పెరిగింది. ఇప్పుడు ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ ధర రూ.199గా మారింది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, మొత్తం 2GB డేటా, రోజుకు 100 SMS వంటి బెనిఫిట్స్ పొందుతారు. ఇంటర్నెట్‌ను అవసరం లేని యూజర్లకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

ఎయిర్‌టెల్ రూ.219 ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.219 ప్లాన్‌లో 28 రోజుల పాటు మొత్తం 3GB డేటా, 300 SMS పొందొచ్చు. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్ రూ.219 ప్లాన్ కన్నా ఎక్కువ డేటా, SMS బెనిఫిట్స్ అందిస్తుంది. ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌లో రోజుకు 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ రోజుకు 100 SMS పొందుతారు. వ్యాలిడిటీ 24 రోజులు ఉంటుంది.

Read Also : iPhone 16 Price : ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్.. ఆపిల్ లవర్స్ ఇలా చేస్తే అతి తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు!

ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్ :
ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్ 28 రోజుల పూర్తి వ్యాలిడిటీతో రోజుకు 1GB డేటా, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది.