iPhone 16 Price : ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్.. ఆపిల్ లవర్స్ ఇలా చేస్తే అతి తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు!
iPhone 16 Price : కొత్త ఐఫోన్ 16 ధర భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 14,400కే కొనేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

iPhone 16 Price
iPhone 16 Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 16 తక్కువ ధరకే కొనేసుకోవచ్చు. గత సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఐఫోన్ 16 మోడల్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,400 కన్నా ఎక్కువ తగ్గింపు అందిస్తోంది.
ఈ డీల్ ద్వారా ప్రీమియం ఐఫోన్ మరింత సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు. రూ. 65,500 కన్నా తక్కువ ధరకు పొందొచ్చు. ఈ ఐఫోన్ కెమెరా సిస్టమ్, iOS 18.4 అవుట్ ఆఫ్ ది బాక్స్, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో వస్తుంది.
మీరు ఐఫోన్ 16 కోసం చూస్తుంటే.. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు. రూ. 65,500 లోపు ధరకే ఐఫోన్ 16 ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 డీల్ :
భారత మార్కెట్లో ఐఫోన్ 16 రూ.79,900కు లాంచ్ అయింది. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్ రూ.68,999కు అందిస్తోంది. అసలు ధర కన్నా రూ.10,901 తక్కువకు పొందొచ్చు.
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.3,445 పొందవచ్చు. కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్ రూ.29వేల వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూతో ఎక్కువ ఆదా చేయొచ్చు.
ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 16 6.1-అంగుళాల OLED ప్యానెల్ 60hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. గరిష్ట ప్రకాశంతో 2,000 నిట్స్, సిరామిక్ షీల్డ్ గ్లాస్ లేయర్‌తో వస్తుంది.
ఈ హ్యాండ్‌సెట్ 3nm A18 బయోనిక్ చిప్‌సెట్‌తో సపోర్టు ఇస్తుంది. A17 చిప్‌సెట్ నుంచి ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ డస్ట్, వాటర్ నిరోధకతకు IP68 రేటెడ్ కలిగి ఉంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐఫోన్ 16 డ్యూయల్ రియర్ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది. ఇందులో 48MP ఫ్యూజన్ సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్‌తో పాటు ఫొటోగ్రఫీ కోసం 12MP మాక్రో లెన్స్ ఉన్నాయి.
సెల్ఫీల విషయానికి వస్తే.. 12MP ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. 4K డాల్బీ విజన్ HDR రికార్డింగ్ ఆప్షన్లకు సపోర్టు ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ పింక్, టీల్, బ్లావ్క్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.