Amazon Prime Day: అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ వచ్చేశాయ్!!
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. ప్రైమ్ డే సేల్స్ ఎప్పుడో తెలిసిపోయింది. ఇండియా వ్యాప్తంగా 2021 జులై 26 నుంచి జులై 27వరకూ రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
- Subhan Ali Shaik
- Published On : July 9, 2021 / 06:52 AM IST
Amazon Prime Day
Amazon Prime Day: ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. ప్రైమ్ డే సేల్స్ ఎప్పుడో తెలిసిపోయింది. ఇండియా వ్యాప్తంగా 2021 జులై 26 నుంచి జులై 27వరకూ రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. జులై 26 అర్ధరాత్రి నుంచి స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, టీవీలు లాంటి పలు కేటగిరీల్లో అమ్మకాలు జరగనున్నాయి.
అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు డీల్స్, లాంచెస్ ముందుగా అందుబాటులో ఉండనున్నాయి. సంవత్సరం పాటు సబ్‌స్క్రి ప్షన్ రూ.999, మూడు నెలల సబ్‌స్క్రి ప్షన్‌కు రూ.329కి దొరుకుతుంది. ఫ్రీ డెలివరీతో పాటు, అన్‌లిమిటెడ్ వీడియో, యాడ్ ఫ్రీ మ్యూజిక్, ఎక్స్‌క్లూజివ్ డీల్స్, ఫ్రీ ఇన్ గేమ్ లాంటి సర్వీసులు వాడుకోవచ్చు.
అంతేకాకుండా కొత్తగా అమెజాన్ అకౌంట్ తీసుకుంటే.. వెయ్యి రూపాయల వరకూ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ప్రైమ్ మెంబర్లు ప్రైమ్ డే రోజున ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో జరిపితే అన్‌లిమిటెడ్‌గా 5శాతం రివార్డు పాయింట్లు అందుతాయి.
