Amazon Black Friday Sale 2023 : ఈ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్, ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్లు, మరెన్నో ఆకర్షణీయమైన డీల్స్.. డోంట్ మిస్!

Amazon Black Friday Sale 2023 : అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2023 ప్రారంభమైంది. అనేక స్మార్ట్‌ఫోన్లు, ఇతర గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్‌లు, డీల్స్‌ అందిస్తోంది. ఈ సేల్ సమయంలో టీవీలు, సెక్యూరిటీ కెమెరాలు, టాబ్లెట్‌లు వంటి మరిన్ని ప్రొడక్టులపై ఆఫర్లను అందిస్తుంది.

Amazon Black Friday Sale 2023 : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నవంబర్ 17, 2023న ప్రారంభమైంది. నవంబర్ 27, 2023 వరకు కొనసాగుతుంది. ఈ 10 రోజుల వ్యవధిలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ఇయర్‌బడ్‌లతో సహా వివిధ ఎలక్ట్రానిక్ ప్రొడక్టులపై అమెజాన్ అత్యంత సరసమైన డీల్‌లను అందిస్తోంది. టాబ్లెట్‌లు, వాక్యూమ్ క్లీనర్‌లు, సెక్యూరిటీ కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు, అప్లియన్సెస్ వంటి మరెన్నో ప్రొడక్టులపై అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు.

Read Also : Amazon Xperience Arena : అమెజాన్ ఎక్స్‌పీరియెన్స్ ఎరీనాతో సిద్ధమైన హైదరాబాద్.. కస్టమర్లకు ఇక పండుగే..!

ఈ సేల్ సందర్భంగా, అమెజాన్ దుస్తులు, ఆఫీసు పర్నిచర్స్, పాత్రలు, కిచెన్ సామాగ్రి, దాదాపు అన్ని కేటగిరీలపై డిస్కౌంట్లు, మరెన్నో డీల్‌లను కూడా అందిస్తుంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2023 సందర్భంగా కస్టమర్‌లు తమకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్‌లతో సహా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులను తక్కువ ధరకు డీల్స్ కొనుగోలు చేయవచ్చు. దేశంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను అందించే శాంసంగ్, లెనోవో వంటి ఇతర బ్రాండ్‌ల నుంచి డివైజ్‌లను కూడా కస్టమర్‌లు కొనుగోలు చేయొచ్చు.

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2023 : స్మార్ట్‌ఫోన్‌లపై బెస్ట్ ఆఫర్లు :
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ డీల్స్ అందిస్తోంది. సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఆపిల్ వాచ్ 9 సిరీస్‌పై గరిష్ట తగ్గింపు అందిస్తోంది. మీరు శాంసంగ్ అభిమానులైతే అమెజాన్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ 2023లో గరిష్ట తగ్గింపును పొందవచ్చు. ఈ అమెజాన్ ఫ్రైడే సేల్ 2023 సమయంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా సెల్ ఫోన్‌ను 899 డాలర్ల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి వెబ్‌సైట్‌లో 1,199 డాలర్ల వద్ద లిస్టు చేసింది. శాంసంగ్ నుంచి వచ్చిన ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో శాంసంగ్ గెలాక్సీ ఎ54, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎ53, శాంసంగ్ గెలాక్సీ ఎ23 వంటి మరిన్ని ఫోన్లు ఉన్నాయి.

Amazon Black Friday Sale 2023  

టాబ్లెట్‌లపై బెస్ట్ డీల్స్, మరెన్నో ఆఫర్‌లు :
అమెజాన్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా శాంసంగ్, లెనోవో రెండూ తమ టాబ్లెట్‌లను తగ్గింపు ధరలకు అందిస్తున్నాయి. శాంసంగ్ టాబ్లెట్‌లను 43శాతం వరకు తగ్గింపుతో అందిస్తుంది. 10.4-అంగుళాల స్క్రీన్‌తో శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్ అమెజాన్‌లో 199 డాలర్ల ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. వాస్తవానికి వెబ్‌సైట్‌లో 349 డాలర్ల వద్ద అందిస్తుంది. శాంసంగ్ నుంచి ఇతర టాబ్లెట్‌లు గెలాక్సీ ట్యాబ్ ఎ8, గెలాక్సీ ట్యాబ్ ఎ7 జాబితా చేసిన ధరల నుంచి 35శాతం వరకు తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్నాయి.

లెనోవో వంటి ఇతర బ్రాండ్‌లు ట్యాబ్ ఎం9-2023ని 30శాతం తగ్గింపు ధర 109డాలర్లకి అందిస్తోంది. వాస్తవానికి ఈ‌-కామర్స్ వెబ్‌సైట్‌లో 149.9 డాలర్లకు అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, అమెజాన్ వెబ్‌సైట్‌లో వైడ్ రేంజ్ ఇతర వస్తువులను అన్వేషించవచ్చు. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2023 నవంబర్ 27న ముగుస్తుంది. అప్పటి వరకు వినియోగదారులు వెబ్‌సైట్‌లోని ఆఫర్‌ల బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంది.

Read Also : Amazon Festival Finale Days : అమెజాన్‌ ఫెస్టివల్ ఫినాలే డేస్ సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై అదిరే డీల్స్.. ఏ ఫోన్ ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు