Amazon Xperience Arena : అమెజాన్ ఎక్స్‌పీరియెన్స్ ఎరీనాతో సిద్ధమైన హైదరాబాద్.. కస్టమర్లకు ఇక పండుగే..!

Amazon Xperience Arena : పండగ సీజన్ సమయంలో 60శాతానికి పైగా 5జీ స్మార్ట్ ఫోన్స్ విక్రయించే అమెజాన్ ఇండియా.. టీవీ, స్మార్ట్ ఫోన్ శ్రేణులలో తెలంగాణ ప్రముఖంగా నిలిచింది. టెలివిజన్స్‌లో తెలంగాణ గణనీయంగా 2x వృద్ధిని చూపించిందని అమెజాన్ ప్రకటించింది.

Amazon Xperience Arena : అమెజాన్ ఎక్స్‌పీరియెన్స్ ఎరీనాతో సిద్ధమైన హైదరాబాద్.. కస్టమర్లకు ఇక పండుగే..!

How to create highlight videos using Google Photos, Here the tech tips in telugu

Amazon Xperience Arena : పండగ సీజన్ సమయంలో 60శాతానికి పైగా 5జీ స్మార్ట్ ఫోన్స్ విక్రయించే అమెజాన్ ఇండియా.. టీవీ, స్మార్ట్ ఫోన్ శ్రేణులలో తెలంగాణ ప్రముఖంగా నిలిచింది. టెలివిజన్స్‌లో తెలంగాణ గణనీయంగా 2x వృద్ధిని చూపించిందని అమెజాన్ ప్రకటించింది. నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆర్థిక స్కీమ్స్ ద్వారా ప్రీమియం స్మార్ట్ ఫోన్లు, పెద్ద స్క్రీన్ టెలివిజన్ ఎంచుకునే కస్టమర్ల సంఖ్యలో తెలంగాణ రాష్ట్రం ప్రముఖ ప్రాంతాలలో ఒకటిగా నిలిచింది.

అక్టోబర్ 26న ‘అమెజాన్ ఎక్స్‌పీరియెన్స్ ఎరీనా’ (AXA)తో హైదరాబాద్‌లో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023ను కూడా వినియోగదారులకు అవకాశం కల్పించింది. ఈ షోకేస్ తమకు ఇష్టమైన బ్రాండ్స్, ఉత్పత్తులను పొందడానికి వినోదాత్మక కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశాన్ని మీడియా, ఇన్ ఫ్లూయెన్సర్స్, కస్టమర్స్‌కు కలిగించింది. ఈ కార్యక్రమంలో 7 ఇంటరాక్టివ్ జోన్స్‌లో బహుమతులు గెలవడానికి కస్టమర్లు పోటీపడ్డారు.

Read Also : TVS Ronin Special Edition : కొత్త టీవీఎస్ రోనిన్ స్పెషల్ ఎడిషన్ బైక్ ఇదిగో.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

అమెజాన్ ఇండియా స్మార్ట్ ఫోన్స్ అండ్ టెలివిజన్స్ డైరెక్టర్ రంజిత్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కస్టమర్‌లకు అమెజాన్ ఎక్స్‌పీరియెన్స్ ఎరీనాను అందించడం  చాలా సంతోషంగా ఉందన్నారు. నవాబ్స్ నగరం స్మార్ట్ ఫోన్, టెలివిజన్ విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న మెట్రోలలో ఒకటిగా నిలిచింది. తెలంగాణ ప్రజలు పండుగల సీజన్‌లో భారత్‌లో అత్యంత ఇష్టపడే, విశ్వసనీయమైన అభిమానించే ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లో అభిమాన ఉత్పత్తుల కోసం షాపింగ్ చేయడం కొనసాగించవచ్చు. ప్రీమియం స్మార్ట్ ఫోన్‌లు, టెలివిజన్‌లపై కస్టమర్ ప్రాధాన్యత పెరుగుతుండటం వల్ల అమెజాన్ ఇండియాలో నో కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ డిస్కౌంట్‌లు, Apay రివార్డ్స్, క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లతో పాటు ఉత్తమమైన ఉత్పత్తుల శ్రేణి వంటి ఆకర్షణీయమైన సరసమైన ఎంపికలను అన్ని ప్రధాన బ్రాండ్ల నుంచి పొందవచ్చు.

స్మార్ట్‌ఫోన్లు : 
* హైదరాబాద్‌లో, 5జీ స్మార్ట్ ఫోన్స్ వాటా పండగల సమయంలో అక్టోబర్ 2023లో 65శాతానికి పైగా చేరుకుంది (వెర్సెస్ 2022లో 40శాతానికిపైగా)
* 4 జీ నుంచి 5జీ అప్ గ్రేడ్స్‌తో ప్రోత్సహించే 10-20 వేల స్మార్ట్‌ఫోన్స్‌లో హైదరాబాద్‌లో స్మార్ట్‌ఫోన్ బిజినెస్ రెండు అంకెల వృద్ధి కనిపించింది.
* నో కాస్ట్ EMI, ఎక్స్ ఛేంజ్ ఆఫర్స్ వంటి సరసమైన ఆప్షన్స్ ద్వారా 30 వేలకు పైగా శ్రేణులలో వృద్ధి కనిపించింది.
* అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2023 సమయంలో, హైదరాబాద్‌లో బెస్ట్ సెల్లర్ మోడల్స్‌లో ఐఫోన్ 13, వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ, iQOO Z7 ప్రో 5జీ, వన్ ప్లస్ 11ఆర్ 5జీ, శాంసంగ్ గాలక్సీ ఎం14 5జీ, రెడ్‌మి 12 5జీలు ఉన్నాయి.

టెలివిజన్స్ :
* 2003లో తెలంగాణా క్యూ3 2023లో అమెజాన్ ఇండియాలో వేగవంతంగా పెరిగే మార్కెట్‌గా అభివృద్ధి చెందింది. భారత్ అంతటా టీవీ సేల్స్ కోసం ప్రముఖ 3 నగరాలలో ఒకటిగా హైదరాబాద్‌తో స్థిరంగా తెలంగాణ మొదటి ర్యాంక్ సాధించింది.
* కస్టమర్లు 4k టీవీల కోసం ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. పెద్ద స్క్రీన్స్ కోసం ముఖ్యంగా 55 అంగుళాల టీవీలకు డిమాండ్ ఏర్పడింది. క్యూఎల్ ఈడీ, ఓఎల్ఈడీ టీవీలు 2023లో తెలంగాణ, హైదరాబాద్ రెండిటిలో 2x సాటిలేని yoy చూపించాయి. అమెజాన్ లో కేటాయించిన జీరో వడ్డీ ఈఎంఐ ఆప్షన్ల నుంచి ముగ్గురు కస్టమర్స్ లో ఒకరు ప్రయోజనం పొందవచ్చు.
* సోనీ, శాంసంగ్, ఎల్జీలు ఈ ప్రాంతంలో కస్టమర్స్ అత్యంత ప్రాధాన్యతనిచ్చిన బ్రాండ్స్‌గా నిలిచాయి.

అమెజాన్ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర :
భారత్‌లో అమెజాన్ అభివృద్ధిలో తెలంగాణ కీలకమైన మార్కెట్ కీలక పాత్ర పోషించింది. ప్రపంచంలోనే అమెజాన్ అతి పెద్ద కార్పొరేట్ భవనం హైదరాబాద్‌లో ఉంది. హైదరాబాద్ క్యాంపస్ అమెరికా బయట అమెజాన్ యాజమాన్యంలో ఉన్న మొదటి కార్యాలయ భవనం. అమెజాన్ భారత్ అంతటా మరియు తెలంగాణలో భౌతిక మౌలిక సదుపాయాలను రూపొందించడంలో పెట్టుబడి పెట్టింది. అమెజాన్ 6 పెద్ద ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాలు, 1.75 లక్షల చదరపు అడుగుల కన్నా ఎక్కువ ప్రాసెసింగ్ ప్రాంతాన్ని కలిగిన సార్టేషన్ కేంద్రంతో పాటు దాదాపు అమెజాన్ సొంతం చేసుకున్న 70, పార్టనర్ డెలివరీ స్టేషన్‌లు, 1800 కన్నా ఎక్కువ ‘ఐ హావ్ స్పేస్’ స్టోర్‌లను కలిగి ఉంది. అమెజాన్‌లో రాష్ట్రానికి చెందిన దాదాపు 50వేల మంది విక్రయదారులు ఉన్నారు. తెలంగాణకు చెందిన అమ్మకందారులకు దేశవ్యాప్తంగా ఉన్న యూజర్లకు డెలివరీ చేయడంలో మౌలిక సదుపాయాలపై చేసిన ఈ పెట్టుబడులు సాయపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి.

ఇటీవల అమెజాన్ రియల్‌మి నార్జో మద్దతుతో ‘ఎక్స్ ట్రా హ్యాపీనెస్ డేస్’ ను ప్రకటించింది. గొప్ప డీల్స్, ఆఫర్స్‌తో ప్రముఖ బ్రాండ్స్ నుంచి శ్రేణుల్లో కొత్త ఉత్పత్తులను కొనడానికి కస్టమర్స్‌కు అవకాశం లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్స్, టెలివిజన్స్, గేమింగ్ అంశాలు, ఆడియో ఆరేగోయం, పర్శనల్ కేర్ ఉత్పత్తుల విస్తృత శ్రేణి ఎంపికపై విక్రేతలను నుంచి ప్రత్యేకమైన డీల్స్, ఆఫర్లను అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ‘ఎక్స్ ట్రా హ్యాపీనెస్ డేస్’ను ప్రవేశపెట్టింది.

రియల్‌మి ఎన్ విడియా, హైర్, పెడిగ్రీ, ఫెరారో, హర్షీస్, ప్యాంపర్స్, జేబీఎల్, జిల్లెట్ నుంచి విస్తృత శ్రేణి ఉత్పత్తులపై కస్టమర్స్ ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా పొందవచ్చు. డిజిట్ సహకారంతో అమెజాన్ ‘స్మార్ట్ ఫోన్ జీనీ’ ప్రోడక్ట్ ఫైండర్‌ను కూడా పరిచయం చేసింది. కొత్త ఇంటరాక్టివ్ విజెట్, కస్టమర్స్ అవగాహనతో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయడంలో నిర్ణయాలు తీసుకునే విధానాన్ని సులభం చేస్తుంది. విలక్షణమైన అవసరాలకు అనుగుణంగా సరైన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు.

Read Also : Google Photos Features : గూగుల్‌ ఫొటోస్‌లో ఇంట్రెస్టింగ్ ఏఐ ఫీచర్.. మీకిష్టమైన వీడియోలను ఇలా హైలైట్ చేయొచ్చు తెలుసా?