Amazon Diwali Sale : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన న్యూస్.. అమెజాన్ దీపావళి సేల్ సందర్భంగా వివో 5జీ ఫోన్ పై ఖతర్నాక్ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. వివో Y400 5జీ ఫోన్ కేవలం నెలకు రూ. 713 నో కాస్ట్ ఈఎంఐతో కొనేసుకోవచ్చు. నో-కాస్ట్ ఈఎంఐ అంటే మీరు ఎలాంటి వడ్డీపై ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. వివో Y400 5G స్మార్ట్‌ఫోన్ 6000mAh లాంగ్ బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్, 8GB వర్చువల్ ర్యామ్ కలిగి ఉంది. భారీ 6.67-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంది. స్పీడ్ ప్రాసెసర్‌ను అందిస్తుంది. వివో Y400 5G ఫోన్ డిస్కౌంట్‌తో ధర, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..
2/6
నెలకు రూ.713 ఈఎంఐతో కొనేసుకోండి : గత ఏడాదిలో వివో Y400 5G ఫోన్ ఆగస్టు 4, 2025న భారత మార్కెట్లో లాంచ్ అయింది. ధర రూ. 25,999 ఉండగా 15శాతం ధర తగ్గింపుతో దాదాపు రూ. 4వేలకు కొనేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.21,998కి కొనుగోలు చేయవచ్చు. మీరు ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, యాక్సస్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే.. మీకు రూ. 2,200 వరకు బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ నో-కాస్ట్ ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చు. నెలకు రూ. 713 చెల్లిస్తే సరిపోతుంది.
3/6
డిస్‌ప్లే, డిజైన్ : వివో Y400 5G ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో అద్భుతమైన స్క్రోలింగ్, యానిమేషన్‌లతో వస్తుంది. నేరుగా సన్‌లైట్‌లో 1800 నిట్‌ల టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.వాటర్, డస్ట్ నిరోధకత కోసం IP68, IP69 రేటింగ్ కూడా అందిస్తుంది. నీటి అడుగున ఫొటోలు తీయొచ్చు. వెట్ హ్యాండ్ టచ్ టెక్నాలజీ కలిగి ఉంది. ఈ ఫోన్ గ్లామ్ వైట్, ఆలివ్ గ్రీన్ ఫినిషింగ్‌లలో లభిస్తుంది.
4/6
డిస్‌ప్లే : వివో Y400 5G ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 4nm ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. 8GB వర్చువల్ ర్యామ్‌తో వస్తుంది. 128GB లేదా 256GB UFS 3.1 స్టోరేజీని అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15పై వివో ఫన్‌టచ్ OS 15తో రన్ అవుతుంది. ఇందులో ఏఐ ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్, ఏఐ నోట్ అసిస్ట్, సర్కిల్ టు సెర్చ్ వంటి ఏఐ పవర్ టూల్స్ కూడా ఉన్నాయి.
5/6
బ్యాటరీ ప్యాక్, కెమెరా సెటప్ : వివో Y400 5G ఫోన్ 6000mAh లాంగ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ బ్యాటరీతో 4 ఏళ్ల బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. సాధారణ వినియోగంలో దాదాపు 2 రోజుల బ్యాటరీ బ్యాకప్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో త్వరగా ఛార్జ్ చేయవచ్చు. కేవలం 20 నిమిషాల్లో 0 నుంచి 50శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది.
6/6
ఇందులో f/1.8 ఎపర్చరుతో 50MP సోనీ మెయిన్ కెమెరా, 2MP బోకె లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ అద్భుతమైన సెల్ఫీలు, పోర్ట్రెయిట్‌ల కోసం 32MP సెల్ఫీ కెమెరాను పొందవచ్చు. అండర్వాటర్ ఫొటోగ్రఫీ మోడ్, ఏఐ ఫొటో అప్‌గ్రేడ్, ఏఐ ఎరేస్ వంటి ఫీచర్లను కూడా పొందవచ్చు.