Amazon Great Freedom Sale 2026 : అమెజాన్ బంపర్ సేల్ ఆఫర్లు.. ఈ ఐక్యూ 15పై ఏకంగా రూ.9వేలు తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేయొద్దు..!

Amazon Great Freedom Sale 2026 : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 సందర్భంగా ఐక్యూ 15 మోడల్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ రూ.9వేలు డిస్కౌంట్ ధరకే కొనేసుకోవచ్చు.

Amazon Great Freedom Sale 2026

  • అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026
  • ఐక్యూ 15పై ఏకంగా రూ. 9వేలు డిస్కౌంట్
  • బ్యాంకు ఆఫర్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లతో మరింత ఆదా

Amazon Great Freedom Sale 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 ప్రారంభమైంది. ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లతో సహా పలు మోడళ్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. మీ ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇదే బెస్ట్ టైమ్..

మీరు ఐక్యూ ఫ్యాన్స్ అయితే ఐక్యూ 15పై అద్భుతమైన డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026లో (Amazon Great Freedom Sale 2026) ఐక్యూ 15 మోడల్ రూ. 9వేలు తగ్గింపుతో లభిస్తోంది. ఐక్యూ 15 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..

ఐక్యూ 15 అమెజాన్ డీల్ :
ఐక్యూ 15 అధికారిక ధర రూ. 76,999 మాత్రమే.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 సందర్భంగా మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 9వేలు తగ్గింపు పొందవచ్చు. మరింత సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.

Read Also : RBI New Rules : రుణగ్రహీతలకు అలర్ట్.. లోన్ EMI కట్టకపోతే బ్యాంకులు మీ ఫోన్ లాక్ చేస్తాయా? RBI కొత్త నిబంధనలివే..!

ఐక్యూ 15 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఐక్యూ15లో 144Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ గ్లోబల్ పీక్ బ్రైట్‌నెస్, డాల్బీ విజన్ సర్టిఫికేషన్‌తో 6.85-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. అంతేకాదు.. ఈ ఐక్యూ ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీ అందిస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఐక్యూ 15లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ 50MP కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో మెయిన్ సోనీ IMX921 సెన్సార్, 3x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా కూడా ఉంది.

ఐక్యూ 15 కొనాలా? వద్దా? :
ఐక్యూ 15 అనేది ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో ఇదొకొటి. పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్, డిస్‌ప్లే క్వాలిటీ, అదిరే కెమెరాలతో వస్తుంది. 2K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, అద్భుతమైన పర్ఫార్మెన్స్, భారీ 7,000mAh బ్యాటరీ, ట్రిపుల్-కెమెరా సెటప్‌తో వస్తుంది.

గత మోడల్‌తో పోలిస్తే ధర భారీగా పెరిగినప్పటికీ, ఫీచర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. మీరు పాత ఫ్లాగ్‌షిప్ నుంచి అప్‌గ్రేడ్ అవ్వాలననా లేదా రూ. 70వేల లోపు మంచి ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తున్నా ఐక్యూ 15 బెస్ట్ ఆప్షన్.