Amazon Summer Sale : ఆపిల్ లవర్స్ ఎగిరిగంతేసే డిస్కౌంట్.. ఐఫోన్ ఎయిర్ రూ. 22వేలు తగ్గిందోచ్.. అమెజాన్‌లో ఇలా కొన్నారంటే?
Amazon Great Summer Sale 2026 : అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ రూ. 22వేలకు పైగా తగ్గింపుతో లభిస్తోంది. ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే?
- Sreehari A
- Published on- May 9, 2026 / 11:56 AM IST
Amazon Great Summer Sale 2026 : కొత్త ఆపిల్ ఐఫోన్ కావాలా? ఆపిల్ అల్ట్రా-స్లిమ్ ఐఫోన్ ఎయిర్ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఐఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్. ప్రస్తుతం 'అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026' నడుస్తోంది. ఆపిల్ అత్యంత సన్నని ఐఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది.
ఈ హ్యాండ్‌సెట్ ఫస్ట్ రూ. 119,900 ధరతో మార్కెట్లోకి వచ్చింది. ఈ సేల్ సమయంలో కేవలం రూ. 97,990కే సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ ఆఫర్‌ను అసలు వదులుకోవద్దు. ఐఫోన్ ఎయిర్ ఫీచర్లకు సంబంధించి పూర్తి డీల్ వివరాలపై ఓసారి లుక్కేయండి.
ఆపిల్ ఐఫోన్ ఎయిర్ డీల్ : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ రూ. 119,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అమెజాన్‌లో రూ. 22వేలు ఫ్లాట్ డిస్కౌంట్ తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 97,990కి లభిస్తోంది. అంతేకాకుండా, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై కొనుగోలుదారులు అదనంగా రూ. 1,250 డిస్కౌంట్ పొందవచ్చు.
ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే రూ. 70వేల వరకు ఎక్స్చేంజ్ పొందవచ్చు. అయితే, పాత ఫోన్ మోడల్ వర్కింగ్ కండిషన్ బట్టి ఫైనల్ రేటు ఉంటుంది.
ఒకేసారి మొత్తం పేమెంట్ చేయలేకపోతే.. కేవలం నెలకు రూ. 3,442 నుంచి ఈఎంఐతో కూడా పేమెంట్ చేయొచ్చు.
ఐఫోన్ ఎయిర్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 6.5-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, బయట 3000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ ప్రోమోషన్ సపోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఆపిల్ A19 చిప్‌సెట్ పవర్ అందిస్తుంది.
ఫొటోగ్రఫీ కోసం ఆపిల్ ఐఫోన్ ఎయిర్ 48MP ఫ్యూజన్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP కెమెరా ఉంది. ఐఫోన్ ఎయిర్ కేవలం 5.6mm మందంతో సుమారు 165 గ్రాముల బరువు ఉంటుంది. ఇప్పటివరకు ఆపిల్ నుంచి వచ్చిన అత్యంత సన్నని ఐఫోన్‌లలో ఇదొకటిగా చెప్పొచ్చు.
