Amazon Prime: పెరగనున్న అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ రేట్.. Check Details

అమెజాన్ లో మెంబర్ షిప్ తీసుకున్నవారికి... ప్రైమ్ వీడియోలు చూసే సౌకర్యంతో పాటు.. షాపింగ్, షిప్పింగ్, స్పెషల్ సేల్స్, సేవింగ్స్ లాంటి బెనిఫిట్స్ అందిస్తోంది సంస్థ.

Amazon Prime: కరోనా జమానాలో ఓటీటీలకు మస్త్ గిరాకీ పెరిగింది. థియేటర్లను వదిలి సినిమాలన్నీ ఓటీటీలకు క్యూ కట్టాయి. అప్పటికే ఒరిజినల్స్, వెబ్ సిరీస్ లతో ఊపుమీదున్న ఓవర్ ద టాప్ ప్లాట్ ఫాంలు… కొత్త సినిమాల రాకతో యూజర్లకు మరింతగా దగ్గరయ్యాయి. కొన్ని నెలలుగా మెంబర్‌షిప్ రేట్లు మార్చని ఓటీటీలు.. ఇప్పుడు యూజర్లకు షాకిచ్చేందుకు రెడీ అయ్యాయి.

రీసెంట్ గా 2021 సెప్టెంబర్ 1 నుంచి.. డిస్నీ హాట్ స్టార్ రేట్లు సవరించింది. మొబైల్, సూపర్, ప్రీమియమ్ ఫార్మాట్లలో సభ్యత్వ ధరలను పెంచేసింది. ఇదే బాటలో… తెలుగులో మోస్ట్ రీచ్డ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్(Amazon Priime)కూడా వెళ్లాలని డిసైడైంది. అతి త్వరలోనే పెరిగిన మెంబర్ షిప్ రేట్లు అమలులోకి తెస్తామని ప్రకటించింది. మెంబర్ షిప్ రెన్యువల్ చేసుకోవాలనుకునేవాళ్లకు ముందుగానే కాస్త వెసులుబాటు కల్పిస్తోంది.

Read This : iPhone 13 Pro Hack : ఆపిల్‌కు షాకిచ్చిన చైనా హ్యాకర్లు.. సెకన్‌లో ఐఫోన్‌ 13ప్రో హ్యాక్!

ఓసారి పాత రేట్లు.. త్వరలో అమలు కాబోయే కొత్త రేట్లు గమనించండి.

  1. అమెజాన్ ప్రైమ్ యాన్యువల్ మెంబర్ షిప్ ఇప్పటివరకు రూ.999 ఉండేది. ఇకనుంచి ఇది రూ.1499కు పెరగబోతోంది.
  2. అమెజాన్ ప్రైమ్ మంత్లీ సభ్యత్వం ఇపుడు రూ.129కు దొరుగుతోంది. ఇకనుంచి రూ.179కు హైక్ కానుంది.
  3. అమెజాన్ ప్రైమ్ క్వార్టర్లీ మెంబర్ షిప్ ఇప్పటివరకు రూ.329కు అందుతోంది. త్వరలోనే క్వార్టర్లీ ప్లాన్ రేట్ ను రూ.459కు పెంచుతామని కంపెనీ తెలిపింది.

అమెజాన్ యూత్ ప్లాన్స్ మెంబర్ షిప్ రేట్లు మాత్రం ఇప్పుడున్న రేట్ కంటే తగ్గిస్తామని ఓ గుడ్ న్యూస్ చెప్పింది సంస్థ. 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండే వారికోసం యూత్ యాన్యువల్ మెంబర్ షిప్ ఇప్పటివరకు రూ.749కు అందుకోంది. త్వరలోనే ఇది ఇది రూ.499 తగ్గిపోనుంది. యూత్ మంత్లీ ప్లాన్ రూ.89 నుంచి రూ.64కు… యూత్ క్వార్టర్లీ ప్లాన్ రూ.299 నుంచి 164కు మారనుంది. ఇందుకోసం.. ఆధార్ కార్డ్ సహా.. పలు వయో నిర్ధారిత డాక్యుమెంట్లు, ఫొటో ఐడీలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

అమెజాన్ లో మెంబర్ షిప్ తీసుకున్నవారికి… ప్రైమ్ వీడియోలు చూసే సౌకర్యంతో పాటు.. షాపింగ్, షిప్పింగ్, స్పెషల్ సేల్స్, సేవింగ్స్ లాంటి బెనిఫిట్స్ అందిస్తోంది సంస్థ. మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేలా ప్లాన్స్, బెనిఫిట్స్ తీసుకొస్తామని అమెజాన్ చెబుతోంది.

Read This : OTT Release: ఈ వారం OTTల్లో వస్తున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

ట్రెండింగ్ వార్తలు