Amazon Prime Day Sale : అమెజాన్ సేల్ కౌంట్ డౌన్.. ఈ 5 స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. ఈరోజే లాస్ట్ ఛాన్స్..!

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్‌కు ఈరోజుతో తెరపడనుంది. స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్‌లు మరెన్నో అందుబాటులో ఉన్నాయి. కొత్త ఫోన్ కొనేందుకు ఇదే లాస్ట్ ఛాన్స్..

Amazon Prime Day Sale

  • అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 ఈరోజుతో మగుస్తోంది
  • జూలై 4 నుంచి 6 వరకు మాత్రమే సేల్ అందుబాటులో
  • స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్‌లు

Amazon Prime Day Sale : అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్‌ జూలై 6తో ముగియనుంది. ఈ సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ బోనస్‌లు, అదనపు కూపన్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేవారికి ఇదే బెస్ట్ టైమ్. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ నుంచి మిడ్‌రేంజ్ సెగ్మెంట్ వరకు ప్రముఖ బ్రాండ్ల ఫోన్ల ధరలు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి.

ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5జీపై బ్రహ్మాండమైన డిస్కౌంట్ లభిస్తోంది. సేల్‌కు (Amazon Prime Day Sale) ముందు రూ. 99,999 ధరకు లభించిన ఈ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ ప్రస్తుతం రూ. 84,999కే లభిస్తోంది. వినియోగదారులు నేరుగా రూ. 15వేల వరకు ఆదా చేసుకోవచ్చు. అత్యుత్తమ కెమెరా, పవర్‌ఫుల్ ప్రాసెసర్, ప్రీమియం డిస్‌ప్లేతో ఈ ఫోన్ హైఎండ్ యూజర్లకు అదిరిపోయే ఆప్షన్.

హై పర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఐక్యూ 15 కూడా అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై రూ. 3వేలు కూపన్ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా ఈ ఫోన్ ధర రూ. 81,999కు తగ్గింది. గేమింగ్, మల్టీటాస్కింగ్, హై-పర్‌ఫార్మెన్స్ కోసం చూస్తున్న వారికి ఈ ఫోన్ బెటర్ ఆప్షన్.

Read Also : Google Pixel 10 : కిర్రాక్ డిస్కౌంట్ బ్రో.. గూగుల్ పిక్సెల్ 10 అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో ఇలా కొనేసుకోండి!

స్పెషల్ డిజైన్, క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి నథింగ్ ఫోన్ (3) అద్భుతమైన డీల్‌ అని చెప్పొచ్చు. 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై 45 శాతం తగ్గింపు అందిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ. 51,999గా ఉంది. ప్రీమియం ఫీచర్లతో పాటు ప్రత్యేక లుక్ కోరుకునే వారికి అద్భుతమైన ఆప్షన్.

వన్‌ప్లస్ నార్డ్ 6 ఫోన్ కూడా ప్రైమ్ డే సేల్‌లో 19 శాతం తగ్గింపుతో లభిస్తోంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ. 42,998గా ఉంది. పర్ఫార్మెన్స్, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో అనేక ఫోన్లు లభ్యమవుతున్నాయి.

బడ్జెట్‌లో శాంసంగ్ ఫోన్ కోసం చూస్తుంటే గెలాక్సీ M47 5జీపై అద్భుతమైన ఆఫర్. 49 శాతం తగ్గింపుతో ఈ ఫోన్ ధర రూ. 23,999కు లభిస్తోంది. అదనంగా రూ. 1,000 కూపన్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. తద్వారా తక్కువ ధరకు ఈ శాంసంగ్ ఫోన్‌ సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ మరికొద్ది గంటల్లో ముగియనుంది. లిమిటెడ్ టైమ్ మాత్రమే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని అనుకుంటే సేల్ ముగిసేలోపు కొనేసుకోవడం బెటర్.