Vivo V40 5G : వారెవ్వా.. రూ.40 వేల Vivo ఫోన్ ఇప్పుడు అతి చౌకైన ధరకే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..!
Vivo V40 5G : వివో V40 5జీపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. 50MP కెమెరాలు, 5500mAh బ్యాటరీ, 120Hz అమోల్డ్ డిస్ప్లేతో వస్తున్న ఈ ఫోన్‌పై రూ.7వేల వరకు ఆదా చేయొచ్చు. ధర, ఫీచర్లపై ఓసారి లుక్కేయండి..
Vivo V40 5G Gets a Major Flipkart
వివో V40 5జీపై భారీ డిస్కౌంట్.. రూ.7వేల వరకు ఆదా చేసే ఛాన్స్
50MP కెమెరాలు, 5500mAh బ్యాటరీ.. వివో V40 5జీపై అదిరిపోయే డీల్
వివో వి40 5G ధర తగ్గింది.. బ్యాంక్ ఆఫర్‌తో మరింత తక్కువకే
Vivo V40 5G : ప్రీమియం లుక్, అద్భుతమైన కెమెరాలు, పవర్ఫుల్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివోకు చెందిన వివో V40 5జీ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఆకర్షణీయమైన డిస్కౌంట్‌తో లభిస్తోంది.
సాధారణంగా రూ.40 వేల బడ్జెట్లో ఉండే ఈ ఫోన్‌ను ఇప్పుడు తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ పరంగా ఈ ఫోన్ అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. వివో 5జీ ఫోన్ పూర్తి వివరాలివే..
వివో వి40 5జీ ధర ఎంతంటే? :
వివోV40 5జీ ఫోన్ 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.39,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధర రూ.34,991కి తగ్గింది. అంటే సుమారు రూ.5వేల వరకు ధర తగ్గింపు లభిస్తోంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.2వేల వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. అన్ని ఆఫర్లు వర్తిస్తే మొత్తం ఆదా రూ.7వేల వరకు ఉంటుంది.
వివో వి40 5జీ స్పెసిఫికేషన్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల కర్వ్డ్ అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం బ్యాక్ సైడ్ 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 50MP కెమెరా అందించారు.
బ్యాటరీ, ఛార్జింగ్‌లోనూ అదుర్స్ :
వివో వి40 5జీలో 5,500mAh బ్యాటరీ, 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌తో పాటు IP68/IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ ఉన్నాయి. సుమారు 190 గ్రాముల బరువున్న ఈ ఫోన్ స్టైలిష్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది.
