AP Inter Exams 2027 : ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ పరీక్షల ఫుల్ షెడ్యూల్ ఇదిగో.. ఎప్పటినుంచంటే?
AP Inter Exams 2027 : ఏపీ ఇంటర్ ఎగ్జామ్స్ 2027 పరీక్షల ఫుల్ షెడ్యూల్ విడుదల అయింది. ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు ఎప్పటి నుంచంటే? ప్రాక్టికల్స్ తేదీలు, పరీక్షల సమయాలు, పూర్తి వివరాలివే..
- Sreehari A
- Updated on- October 22, 2026 / 07:41 PM IST
AP Inter Exams 2027
- ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..
- ఫిబ్రవరి 1 నుంచే ప్రాక్టికల్స్.. ఫిబ్రవరి 24 నుంచే పరీక్షలు
AP Inter Exams 2027 : ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. 2027 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ ఇంటర్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దీంతో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్‌ను మరింత వేగవంతం చేయాల్సిన సమయం వచ్చేసింది.
ఫిబ్రవరి 24 నుంచి ఫస్టియర్ పరీక్షలు :
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు 2027 ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మొదలవుతాయి. రెగ్యులర్ విద్యార్థులతో పాటు బ్యాక్లాగ్ విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షల సమయం ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 1 నుంచే ప్రాక్టికల్స్.. :
థియరీ పరీక్షలకు ముందే ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. జనరల్ కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
Read Also : Vivo Y600 Launch : ఒక్క ఫోన్‌తో గిన్నిస్ రికార్డ్? 10,000mAh బ్యాటరీతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు అదుర్స్!
ఈ పరీక్షలను 2 సెషన్లలో నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఆదివారాల్లోనూ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
విద్యార్థులు తప్పక తెలుసుకోండి :
ప్రస్తుతం ప్రకటించింది తాత్కాలిక షెడ్యూల్ మాత్రమే. ఏ రోజు ఏ సబ్జెక్టుకు పరీక్ష నిర్వహిస్తారనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫుల్ టైమ్‌టేబుల్‌ను అప్పుడే తెలుసుకోవచ్చు.
విద్యార్థులు పరీక్ష తేదీలను ముందుగానే గుర్తుంచుకుని, సబ్జెక్టుల వారీగా చదువుకునే ప్లానింగ్ రెడీ చేసుకోవడం బెటర్.. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ఇప్పటి నుంచే రివిజన్ ప్రారంభిస్తే పరీక్షలకు రెడీ అవ్వొచ్చు..
తేదీల వారీగా ముఖ్య పరీక్షలివే..
- ఫిబ్రవరి 24, 25 : లాంగ్వేజెస్, ఎలెక్టివ్ సబ్జెక్ట్స్
- ఫిబ్రవరి 26, 27 : ఇంగ్లీష్
- మార్చి 1, 2 : మ్యాథమెటిక్స్, సివిక్స్
- మార్చి 3, 4 : బయాలజీ, హిస్టరీ
- మార్చి 5, 8 : ఫిజిక్స్, ఎకనామిక్స్
- మార్చి 9, 11 : కెమిస్ట్రీ, కామర్స్
- మార్చి 12, 13 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్
- మార్చి 15, 16 : మోడర్న్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్
