Apple Diwali Sale Offers : ఆపిల్ దీపావళి సేల్ ఆఫర్లు.. ఐఫోన్ 15, మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్స్‌పై రూ. 10వేల వరకు తగ్గింపు

Apple Diwali Sale Offers : ఆపిల్ దీపావళి సేల్ ఆఫర్‌లను ప్రకటించింది. iPhone 15, MacBook Air, iPads, ఇతర డివైజ్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది.

Apple Diwali Sale Offers _ Up to Rs 10K discount on iPhone 15, MacBook Air, iPads Details in Telugu

Apple Diwali Sale Offers : ఆపిల్ అభిమానులకు అదిరే వార్త.. ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple) దీపావళి సేల్ ఆఫర్ల (Apple Diwali Sale Offers)ను ప్రకటించింది. ఐఫోన్ 15 (iPhone 15), మ్యాక్‌బుక్ ఎయిర్ (MacBook Air), iPad ఇతర డివైజ్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. కంపెనీ ఆపిల్ స్టోర్‌లో అన్ని ఆఫర్‌లను వెల్లడించింది.

ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు (Apple BKC), (Apple Saket) రిటైల్ స్టోర్‌లలో ఇప్పటికే దీపావళి సేల్ ఈవెంట్ అందుబాటులో ఉందని ఆపిల్ ధృవీకరించింది. ఆపిల్ ప్రొడక్టులపై రూ.10వేల వరకు క్యాష్‌బ్యాక్ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆపిల్ దీపావళి ఆఫర్లు : ఐఫోన్ 15, ఐఫోన్ 13 డీల్స్ :
ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మాక్స్ రూ. 6వేల వరకు క్యాష్‌బ్యాక్ తగ్గింపు ఆఫర్‌తో అందుబాటులో ఉన్నాయి. ఈ 2023 ఐఫోన్‌ల ధరను గణనీయమైన తేడాతో తగ్గిస్తుంది. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ రూ. 5వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో అమ్మకానికి ఉన్నాయి. అదేవిధంగా, ఆపిల్ దీపావళి సేల్ ఆఫర్‌లో భాగంగా ఐఫోన్ 14పై రూ. 4వేల తగ్గింపుతో పాటు ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 13పై రూ. 3వేల తగ్గింపు, (iPhone SE)పై రూ. 2వేల తగ్గింపును అందిస్తోంది.

Read Also : Apple iPhone 12 Price Drop : ఈ పండుగ సీజన్‌లో ఆపిల్ ఐఫోన్ 12పై భారీ తగ్గింపు.. ఇదే బెస్ట్ టైం.. ఇప్పుడే కొనేసుకోండి..!

రీకాల్ చేసేందుకు (iPhone 15) ప్రారంభ ధర రూ. 79,900తో వస్తుంది. అయితే, ఐఫోన్ ప్లస్ మోడల్ (iPhone 15 Plus) రూ. 89,900కి లాంచ్ అయింది. ఐఫోన్ 15 ప్రో ధర రూ. 1,34,900, ఆపిల్ నుంచి అత్యంత ప్రీమియం ఐఫోన్ 15 ప్రో మాక్స్ (iPhone 15 Pro Max) ధర రూ. 1,59,900కు పొందవచ్చు. ఇప్పుడు అధికారికంగా ఐఫోన్ 13 ధర రూ. 59,900కు పొందవచ్చు.

మ్యాక్‌బుక్ ఎయిర్‌పై ఆపిల్ దీపావళి 2023 ఆఫర్.. :
ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ అయిన (MacBook Air M2) ధర రూ. 10వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో అందుబాటులో ఉంది. కానీ, ఈ ఆఫర్ 13-అంగుళాలు, 15-అంగుళాల మోడళ్లపై మాత్రమే వర్తిస్తుంది. 13-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ M2 మోడల్ భారత మార్కెట్లో రూ. 1,14,900 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

Apple Diwali Sale Offer 

మ్యాక్‌బుక్ ఎయిర్ M1ని కొనుగోలు చేయాలనుకునే అధికారిక ఆపిల్ స్టోర్ పేజీ ప్రకారం.. రూ. 8వేల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ మోడల్ అసలు ధర రూ.99,900కు ఉండగా.. అమెజాన్ ఈ మ్యాక్‌బుక్‌ను రూ. 69,990కి విక్రయిస్తోంది. అదనంగా, 24-అంగుళాల iMac, Mac mini రూ. 5వేల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో అందుబాటులో ఉన్నాయి.

ఐప్యాడ్‌లపై ఆపిల్ దీపావళి 2023 ఆఫర్ :
ఆపిల్ అన్ని ప్రొడక్టు కేటగిరీలో డిస్కౌంట్లను అందిస్తోంది. వినియోగదారులు టాబ్లెట్‌లపై ఆఫర్‌లను కూడా పొందవచ్చు. 11-అంగుళాల/12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో మోడల్స్, ఐప్యాడ్ ఎయిర్‌పై రూ. 5వేల తగ్గింపును అందిస్తోంది. 10వ జనరేషన్ 9వ జనరేషన్ ఐప్యాడ్ వరుసగా రూ.4వేలు, రూ.3వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లతో అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ దీపావళి సేల్‌లో భాగంగా ఐప్యాడ్ మినీ రూ. 3వేల తగ్గింపు ఆఫర్‌తో విక్రయిస్తోంది.

Read Also : Apple Affordable iPads : అత్యంత సరసమైన కొత్త ఐప్యాడ్‌లు.. ఈ నెల 17నే లాంచ్.. పూర్తి వివరాలు మీకోసం..!

ట్రెండింగ్ వార్తలు