Apple iPhone 15 Discount : కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఆపిల్ ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

Apple iPhone 15 : ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. అదనపు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లతో ఇంకా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

Apple iPhone 15 for Rs 67k deal you can't afford to miss it

Apple iPhone 15 Discount : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ప్రస్తుతం ఐఫోన్ 15 భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రత్యేకించి మీరు ఐఫోన్ కొనాలనుకుంటే.. ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 మోడల్ భారీ తగ్గింపుతో లభిస్తుంది.

Read Also : Amazon Mega Electronics Sale : అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్స్ సేల్.. స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్స్, ల్యాప్‌టాప్‌లపై టాప్ డీల్స్..!

ఈ ఫోన్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 79,900 ఉండగా.. తగ్గింపు ధరతో రూ. 67వేలకు సొంతం చేసుకోవచ్చు. మీ క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి.. ఐఫోన్ 15 మోడల్ రూ. 55వేలు లేదా అంతకంటే తక్కువ ధరకు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఐఫోన్ 15 (128జీబీ స్టోరేజీ) మోడల్ రూ. 12,901 తగ్గింపుతో రూ. 66,999కే అందుబాటులో ఉంది.

బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్ :
అయితే, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు రూ. 2వేలు అదనపు తగ్గింపును పొందవచ్చు. అంటే.. ఐఫోన్ 15 ధర రూ. 64,999కు కొనుగోలు చేయొచ్చు. సిటీ బ్యాంక్, హెచ్‌ఎస్‌బీసీ, డీబీఎస్ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్‌లతో అదనంగా 10 శాతం తగ్గింపును పొందవచ్చు. మరో రూ. 1,500 ధర తగ్గితే చివరిగా ఐఫోన్ 15 మోడల్ రూ. 63,499కు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ. 3,300 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

Apple iPhone 15 deal  

ఆసక్తిగల యూజర్లు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో ఐఫోన్ 15ని రూ. 54,900కు కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుత ఫోన్ వర్కింగ్ కండిషన్, కొనుగోలు చేసిన సంవత్సరాన్ని బట్టి ధర నిర్ణయించవచ్చు. ఆపిల్ ఐఫోన్ 15 మోడల్ అడ్వాన్స్‌డ్ ఎ16 బయోనిక్ చిప్‌సెట్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ లైటనింగ్ పర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది. మల్టీటాస్కింగ్, గేమింగ్ వంటి ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు.

గతంలో ఐఫోన్ 14 సిరీస్ ప్రో మోడల్‌ మాదిరిగా డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌ కలిగి ఉంది. ఐఫోన్ 15 పవర్‌ఫుల్ కెమెరా సెటప్‌తో హై-క్వాలిటీ లెన్స్‌లతో వస్తుంది. అద్భుతమైన ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయొచ్చు. ఇంకా మరెన్నో ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్ నుంచి తక్కువ ధరకే ఐఫోన్ 15 ఆర్డర్ పెట్టేసుకోండి.

Read Also : WhatsApp New Update : వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్ వచ్చేస్తోంది.. ఇకపై లింక్ చేసిన డివైజ్‌ల్లో కూడా చాట్స్ ప్రొటెక్ట్ చేయొచ్చు..!

ట్రెండింగ్ వార్తలు