Apple iPhone 15 : ఆపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 15 ధర భారీగా తగ్గింది. మీరు కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 15పై అద్భుతమైన డీల్ అందిస్తోంది. ఎక్కువ ధర పెట్టి ఐఫోన్ కొనలేనివారు ఇప్పుడు అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
2/8
వాస్తవానికి, రూ. 79,999 ధరకు లాంచ్ అయిన ఈ ఐఫోన్ ఇప్పుడు చాలా తక్కువ ధరకే లభిస్తోంది. క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఆఫర్లతో కస్టమర్లు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.
3/8
2023లో ఈ ఐఫోన్ లాంచ్ అయినప్పటికీ రూ. 55వేల కన్నా తక్కువ ధరకు మార్కెట్లో లభ్యమవుతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
4/8
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 15 ధర : ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 15 రూ.54,900 ధరకు అందుబాటులో ఉంది. లాంచ్ ధర నుంచి రూ.25వేలు నేరుగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ లేదా ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌తో రూ.3,315 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తుంది.
5/8
ఆసక్తిగల కొనుగోలుదారులు నెలకు రూ.8,817 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను పొందవచ్చు.
6/8
అదనంగా, ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ యూజర్లు తమ పాత ఫోన్లపై రూ.44,450 వరకు ట్రేడ్ చేయొచ్చు. అయితే, ఫైనల్ ఎక్స్ఛేంజ్ ధర పాత ఫోన్ బ్రాండ్, మోడల్, వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
7/8
ఆపిల్ ఐఫోన్ 15 స్పెసిఫికేషన్లు : ఐఫోన్ 15లో డిస్‌ప్లే 6.1-అంగుళాల OLED ప్యానెల్, గరిష్టంగా 2,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. ఫాస్ట్ A16 బయోనిక్ ప్రాసెసర్‌తో వస్తుంది. 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది.
8/8
కెమెరా విషయానికి వస్తే.. ఐఫోన్ 15లో 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్ కెమెరా, 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. IP68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఉంది.