×
Ad

Apple iPhone 17 Series : ఆపిల్ ఫ్యాన్స్ మీకోసమే.. కొత్త ఐఫోన్ 17 సిరీస్ కొంటున్నారా? లేదంటే ఐఫోన్ 16e కొంటారా? ఏ ఐఫోన్ కొంటే బెటర్?

Apple iPhone 17 Series : ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్, ఐఫోన్ 16e ఏ ఐఫోన్ కొంటారో కొనేసుకోండి.

Apple iPhone 17 Series

Apple iPhone 17 Series : ఆపిల్ కొత్త ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఈ సెప్టెంబర్‌లోనే ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ లాంచ్ అయింది. అప్పటికే భారత మార్కెట్లో మరో 5 ఐఫోన్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. ఈ లైనప్‌లో ఐఫోన్ 17 సిరీస్ కొనేసుకోవచ్చు. అంతేకాదు.. పర్ఫార్మెన్స్, కెమెరా పరంగా పరిశీలిస్తే ఐఫోన్ 17 ప్రో మోడల్స్ కొనేసుకోవచ్చు.

అన్నింటికన్నా ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌ అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది. ఈ ఐఫోన్లకు పోటీగా అత్యంత (Apple iPhone 17 Series) సరసమైన ఐఫోన్ 16e కూడా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఐఫోన్ 16e ధర రూ. 59,900 ఉండగా, 2TB స్టోరేజ్‌తో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ రూ. 2,29,900 వరకు ఉన్నాయి. మీరు ఈ ఏడాదిలో కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తుంటే ఈ మోడల్ ఐఫోన్లలో ఏదో ఒకటి ఎంచుకుని కొనేసుకోవచ్చు.

ఐఫోన్ 16e :
ఆపిల్ 2025 లైనప్‌లో ఐఫోన్ 16e అత్యంత సరసమైన ఫోన్. 167 గ్రాములు, 7.8mm మందంతో కాంపాక్ట్ కలిగి చాలా సౌకర్యంగా ఉంటుంది. 6.1-అంగుళాల OLED డిస్‌ప్లే కలిగి ఉంది. అయినప్పటికీ, 60Hzకి పరిమితమైంది. కొత్త ఐఫోన్ మోడల్స్ అందించే రిఫ్రెష్ రేటు పొందలేరు. బ్రైట్‌నెస్ 1,200 నిట్‌ల వద్ద టాప్ బ్రైట్ నెస్ అందిస్తుంది. ఐఫోన్ 16e లోపల 8జీబీ ర్యామ్, A18 చిప్‌ కలిగి ఉంది. స్టోరేజ్ ఆప్షన్లు 512GB వరకు ఉంటాయి.

Apple iPhone 16e

హై ఎండ్ మోడళ్ల మాదిరిగానే స్పీడ్ LPDDR5X ర్యామ్, NVMe స్టోరేజ్‌ కలిగి ఉంది. కెమెరా వారీగా బ్యాక్ సైడ్ 48MP ప్రైమరీ లెన్స్, 12MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. కానీ, అల్ట్రా-వైడ్ లేదా టెలిఫోటో లేదు. 20W వైర్డు, 7.5W వైర్‌లెస్‌లో ఛార్జింగ్ నెమ్మదిగా ఉంటుంది. 4,005mAh యూనిట్‌తో బ్యాటరీ లైఫ్ రోజుంతా వస్తుంది. ఈ ఐఫోన్ ధర రూ. 59,900 నుంచి కొనుగోలు చేయొచ్చు. అతి తక్కువ ధరలో ఐఫోన్ కొనాలని అనుకునేవారికి బెస్ట్ ఐఫోన్ అని చెప్పొచ్చు.

ఐఫోన్ 17 :

చాలా మందికి ఐఫోన్ 17 బెస్ట్ ఆప్షన్. ధర, పర్ఫార్మెన్స్ విషయంలో అద్భుతంగా ఉంటుంది. ఆపిల్ నాన్-ప్రో మోడళ్లకు కూడా ప్రోమోషన్‌ తీసుకువచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్, బ్రైట్ డిస్‌ప్లే ఆల్వేస్ ఆన్‌ ఆప్షన్ కూడా కలిగి ఉంది. A19 చిప్‌పై రన్ అవుతుంది. A19 ప్రో లాంటిది కాదు. గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు బెస్ట్. కెమెరాల విషయానికి వస్తే.. 48MP ప్రైమరీ, కొత్త 48MP అల్ట్రా-వైడ్‌తో వస్తుంది. ఐఫోన్ 16e కన్నా ఎక్కువ మల్టీఫేస్ ఫీచర్లను అందిస్తుంది. ప్రీమియం ఫోన్‌ను కోరుకునేవారు అయితే ఐఫోన్ 17 అద్భుతమైన ఆప్షన్.

Read Also : DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పండగే.. వచ్చేవారమే DA పెంపు..? భారీగా పెరగనున్న వేతనాలు.. దీపావళి బోనస్ కూడా..!

ఐఫోన్ ఎయిర్ :
ఆపిల్ అందించే ఐఫోన్లలో ఐఫోన్ ఎయిర్ చాలా స్పెషల్. కేవలం 5.6 మిమీ మందం, 165 గ్రాముల బరువు ఉంటుంది. 6.5-అంగుళాల ఐఫోన్‌ చాలా సన్నగా ఎంతో తేలికగా ఉంటుంది. టైటానియం ఫ్రేమ్ దృఢంగా ఉంది. కానీ, ఈ డిజైన్‌ కోసం ఆపిల్ ఎయిర్‌లో సింగిల్ 48MP బ్యాక్ కెమెరా కలిగి ఉంది.

అల్ట్రా-వైడ్ లేదా టెలిఫోటో లేదు. బ్యాటరీ లైఫ్ ఇతర మోడళ్ల మాదిరిగా దృఢంగా ఉండదు. ఇతర ఐఫోన్ 17 మోడళ్లతో పోలిస్తే ఛార్జింగ్ కూడా చాలా స్లో ఉంటుంది. ప్లస్ మోడల్ పరిశీలిస్తే.. ఐఫోన్ ఎయిర్ A19 ప్రో చిప్ ద్వారా పవర్ పొందుతుంది. పర్ఫార్మెన్స్ చూడా బాగుంటుంది. ఐఫోన్ ఎయిర్ ప్రారంభ ధర రూ. 1,19,900 ఉండగా, స్టైలిష్, అల్ట్రా-పోర్టబుల్ ఐఫోన్‌ను కోరుకునే వారికి బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు.

Apple iPhone 17

ఐఫోన్ 17 ప్రో :

ఆపిల్ ఐఫోన్ 17 ప్రో పవర్ యూజర్లకు అద్భుతంగా ఉంటుంది. స్టేబుల్ పర్ఫార్మెన్స్, స్టీమ్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌తో 6.3-అంగుళాల స్క్రీన్‌ కలిగి ఉంది. ఆపిల్ అల్యూమినియం యూనిబాడీ డిజైన్‌ కూడా కలిగి ఉంది. ట్రిపుల్-కెమెరా సెటప్ అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది.

48MP సెన్సార్‌లతో 4x ఆప్టికల్ జూమ్, 8x ఆప్టికల్ లాంటి జూమ్ టెలిఫోటోతో సహా వీడియో రికార్డింగ్ 120fps వద్ద 4K, ప్రోరేస్ (RAW)కి సపోర్టు అందిస్తుంది. లిడార్ స్కానర్, మెరుగైన మైక్రోఫోన్‌లు కూడా ఉన్నాయి. ఐఫోన్ 17 ప్రో ధర రూ. 1,29,900 ఉండగా, క్రియేటర్లు, గేమర్‌లకు బెస్ట్ ఛాయిస్.

ఐఫోన్ 17 ప్రో మాక్స్ :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ అద్భుతమైన ఐఫోన్. ఐఫోన్ 17 ప్రో అన్ని ఫీచర్లు కలిగి ఉంది. కానీ, భారీ 6.9-అంగుళాల స్క్రీన్, అతిపెద్ద బ్యాటరీ, 2TB స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంది. USB-C సపోర్టు, 10Gbps వద్ద స్పీడ్‌ అందిస్తుంది. భారీ ఫైల్స్ వాడే క్రియేటర్లకు బాగుంటుంది. ట్రేడ్-ఆఫ్ సైజుతో పాటు కొద్దిగా బరువు ఉంటుంది. ఈ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,49,900 ఉంటుంది. ఖర్చు పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుంటే ఈ ఐఫోన్ కొనేసుకోవచ్చు.

ఏ ఐఫోన్ కొనాలి? :
ఆపిల్ ఐఫోన్ 17 ధర, ఫీచర్లు, ఫ్యూచర్-ప్రూఫింగ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఐఫోన్ 16e బడ్జెట్-ఫ్రెండ్లీ ఎంట్రీ పాయింట్. అయితే, ఐఫోన్ ఎయిర్ అన్నింటికంటే స్లిమ్, తేలికైన డిజైన్‌ కోరుకునే వారికి బెస్ట్. అలాగే, ఐఫోన్ 17 ప్రో గేమర్‌లు, క్రియేటర్లకు పవర్‌హౌస్ కలిగిన ఐఫోన్ 17 ప్రో మాక్స్ టాప్ ఆప్షన్ అని చెప్పొచ్చు.