Flipkart Freedom Sale : వావ్.. ఆపిల్ ఐఫోన్ 17పై ఏకంగా రూ. 11వేలు డిస్కౌంట్.. ఈ డీల్ అస్సలు వదులుకోవద్దు!
Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ ఐఫోన్ 17 కొనుగోలు చేస్తే రూ. 11 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. పూర్తి ఆఫర్ వివరాలివే..
- Sreehari A
- Published on- August 16, 2026 / 05:34 PM IST
Apple iPhone 17
- ఆపిల్ ఐఫోన్ 17పై మొత్తం రూ. 11 వేలు డిస్కౌంట్
- బ్యాంకు డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ, ఇతర ఆఫర్లు
- ఫైనల్ ధర రూ.71,250కు ఇంటికి తెచ్చుకోవచ్చు
Flipkart Freedom Sale : కొత్త ఐఫోన్ కొనాలని అనుకుంటున్నారా? ఐఫోన్ 17 కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఐఫోన్ 17పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఐఫోన్ మోడల్ ప్రారంభ ధర కన్నా చాలా తక్కువ ధరకే లభిస్తోంది.
బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా పొందవచ్చు. ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.82,900 ఉండగాప్రస్తుతం రూ.6వేలు తక్కువ ధరకే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లతో ఈ ఐఫోన్ 17 మోడల్ మరింత చౌకైన ధరకే లభిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17 డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 17పై రూ.6వేలు డైరెక్ట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ అసలు ధర రూ. 82,900 ఉండగా ఇప్పుడు రూ.77వేలకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ.5,750 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మొత్తంగా రూ.11,750 వరకు తగ్గింపు పొందవచ్చు. డిస్కౌంట్ తర్వాత ఈ ఐఫోన్ కేవలం రూ.71,250కే లభిస్తుంది. ఈ ఐఫోన్ బ్లాక్ కలర్ వేరియంట్ మాత్రమే అందబాటులో ఉంది.
Read Also : Realme P4s Leak : భారీ బ్యాటరీతో కొత్త రియల్‌మి P4s వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్..!
ఐఫోన్ 17 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 17లో 2622×1206 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.3-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్ అందిస్తుంది.
ఆపిల్ A19 ప్రాసెసర్‌తో పాటు iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో NFC, GPS, 5G, Wi-Fi 7, eSIM సపోర్ట్, బ్లూటూత్ 6, USB-C పోర్ట్ ఉన్నాయి.
ఐఫోన్ 17 బ్యాక్ సైడ్ ఎఫ్/1.78 అపర్చర్‌తో 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా ఉంది. ఇందులో ఎఫ్/2.2 అపర్చర్‌తో 48MP ఫ్యూజన్ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఎఫ్/1.9 అపర్చర్‌తో 18MP ఫ్రంట్ కెమెరా ఉంది. కొలతల పరంగా చూస్తే ఐఫోన్ 17 మోడల్ 71.5 మిమీ వెడల్పు, 149.6 మిమీ ఎత్తు, 7.95 మిమీ మందం, 177 గ్రాముల బరువు ఉంటుంది.
