Apple iPhone 17 Pro Max : కొంటే ఐఫోన్ కొనాలి.. ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అయితే బాధపడతారు!

Apple iPhone 17 Pro Max : ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ భారీగా తగ్గిందోచ్.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లాంచ్ సమయంలో ఈ ఐఫోన్ పాత ఫ్లాగ్‌షిప్ మోడల్ ఒక్కసారిగా తగ్గింది. ఇంతకన్నా తక్కువ ధరలో ఎలా పొందాలంటే?

Apple iPhone 17 Pro Max

  • విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ తగ్గింపు
  • ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో మరింత తగ్గుతుంది
  • భారీ డిస్‌ప్లే, పవర్‌ఫుల్ చిప్, అడ్వాన్స్ కెమెరా సెటప్

Apple iPhone 17 Pro Max : ఆపిల్ అభిమానులకు అదిరిపోయే వార్త.. నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు రాబోతున్నాయి. ఐఫోన్ 18 ప్రో మాక్స్, ఐఫోన్ 18 ప్రోలను సెప్టెంబర్ 9న జరిగే సర్ప్రైజ్ అండ్ షైన్ ఈవెంట్‌లో ఆవిష్కరించనుంది.

ఈ కొత్త ఐఫోన్ మోడల్స్ అధికారిక లాంచ్ ముందే ప్రస్తుత జనరేషన్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర భారీగా తగ్గింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 5వేలకుపైగా భారీ తగ్గింపుతో లభిస్తోంది. బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో ఈ ఐఫోన్ ధర ఇంకా తగ్గుతుంది. కొత్త ఐఫోన్ కోసం చూస్తుంటే విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్ డీల్ పొందాలో ఇప్పుడు చూద్దాం..

ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర తగ్గింపు :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ లాంచ్ సమయంలో ధర రూ. 1,49,900గా ఉండేది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ. 5,910 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. తద్వారా రూ. 143,990కి లిస్టు అయింది. బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా రూ. 4వేలు అదనపు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ 6 నెలల్లో నెలకు కేవలం రూ. 23,331 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది.

Read Also : Jio Recharge Plans : జియో బంపర్ ఆఫర్.. ఈ ప్లాన్లలో ఫ్రీగా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

ఐఫోన్ 17 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో యాంటీ-రిఫ్లెక్టివ్ డిస్‌ప్లేతో 6.9-అంగుళాల 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే ఉంది. ఈ హ్యాండ్‌సెట్ A19 ప్రో చిప్‌సెట్ ద్వారా రన్ అవుతుంది. ఈ ఐఫోన్ మోడల్ 4,823mAh బ్యాటరీ ఉంది.

అదనంగా 30W వైర్డ్ ఛార్జింగ్, 25W వైర్‌లెస్ ఛార్జింగ్, 4.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. 39 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అంతే కాకుండా, ఈ ఐఫోన్ మోడల్ వేపర్ ఛాంబర్ కూలింగ్ ఫీచర్ కూడా అందిస్తుంది. ఫ్రంట్, బ్యాక్ సైడ్ సెరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్ ఉంది. కొనుగోలు చేశాక ఈ స్మార్ట్‌ఫోన్ iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

కెమెరా ప్రియుల కోసం ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌లో ట్రిపుల్ ఫ్యూజన్ కెమెరా సెటప్‌ అమర్చారు. ఇందులో 48MP మెయిన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ సెన్సార్, 4x ఆప్టికల్ జూమ్‌తో 48MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ ఫ్రంట్ సైడ్ 18MP కెమెరా అత్యంత ఆకర్షణీయంగా ఉంది.