Apple iPhone 17e : ఆపిల్ లవర్స్‌కు పండగే.. ఈ ఐఫోన్ 17e భారీగా తగ్గిందోచ్.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!
Apple iPhone 17e : ఆఫర్ అదిరింది.. ఐఫోన్ 17e చాలా తక్కువకే లభిస్తోంది. ఇంత కన్నా తక్కువ ధరకు ఈ ఐఫోన్ దొరకదు.. ఈ ఐఫోన్ ఎక్కడ? ఎందులో కొనాలంటే?
- Sreehari A
- Published on- August 18, 2026 / 09:25 PM IST
Apple iPhone 17e price
- విజయ్ సేల్స్‌లో ఐఫోన్ 17e తక్కువ ధరకు వస్తుంది
- బ్యాంకు ఆఫర్లతో ధర రూ. 55వేల కన్నా తక్కువకు రావచ్చు
- ఈ ఫోన్‌లో ఫాస్ట్ ప్రాసెసర్, మంచి డిస్‌ప్లే కెమెరా ఆప్షన్లు
Apple iPhone 17e : ఆపిల్ అభిమానులకు దిమ్మతిరిగే ఆఫర్.. ఒకవైపు ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి ఐఫోన్ల వరకు ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ ధరలను ఆపిల్ అమాంతం పెంచేసింది. ఇలాంటి సమయంలో ఐఫోన్ తక్కువ ధరకు దొరకడం కష్టమే. కానీ, మీరు ఐఫోన్ 17e ఫోన్ అతి తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.
ఐఫోన్‌ను కొనాలని అనుకుంటే ఇప్పుడే ఆ పని చేయండి. ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాదు.. ఎందుకంటే కొత్త ఐఫోన్ 17e ప్రస్తుతం విజయ్ సేల్స్ (Apple iPhone 17e) అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 62వేల లోపు ధరకే లభిస్తోంది.
అంతేకాదు.. బ్యాంక్ కార్డ్ ఆఫర్లతో అసలు ధర ఇంకా తగ్గించుకోవచ్చు. ఇదే ధరకు సరికొత్త A19 ప్రాసెసర్ కూడా అందిస్తుంది. సిరి ఏఐ ఫీచర్లతో వస్తుంది. అయితే, ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. ఆపిల్ ఐఫోన్ 17e కొనాలని అనుకుంటే ఇప్పుడే బెటర్. విజయ్ సేల్స్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
ఐఫోన్ 17e విజయ్ సేల్స్ డీల్ :
ఆపిల్ ఐఫోన్ 17e మోడల్ ఫస్ట్ రూ. 64,999 ధరతో లాంచ్ కాగా, ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో కేవలం రూ. 61,999కే అమ్ముడవుతోంది. తద్వారా రూ. 3వేలు ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది.
అంతేకాదు.. హెచ్‌ఎస్‌బీసీ లేటెస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 10వేలు ఫ్లాట్ డిస్కౌంట్ పొందొచ్చు. తద్వారా ధర రూ. 54,999కి తగ్గుతుంది. ఈ ఇ-కామర్స్ బ్రాండ్ 24 నెలల్లో నెలకు రూ. 2,879 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను అందిస్తోంది. అంతేకాదు.. అప్‌గ్రేడ్ కోసం ప్లాన్ చేస్తుంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు.
Read Also : Oppo Find X9 Deal : ఒప్పో ఆఫర్ అదిరింది.. ఇలా కొన్నారంటే రూ. 22వేలు డిస్కౌంట్.. ఫ్లిప్‌కార్ట్‌లో ఎంతంటే?
ఐఫోన్ 17e కొనాలా? వద్దా? :
ఆపిల్ సరికొత్త టెక్నాలజీతో వచ్చిన ఐఫోన్ 17e అతి తక్కువ ధరలో లభ్యమవుతోంది. ఈ ఐఫోన్ 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. టాప్ బ్రైట్‌నెస్ 1,200 నిట్స్ వరకు ఉంటుంది. మరో స్పెషల్ ఫీచర్ సెరామిక్ షీల్డ్ 2 మరింత ప్రొటెక్షన్ అందిస్తుంది.
టెక్నికల్ పరంగా చూస్తే.. ఈ ఐఫోన్ మోడల్ ఆపిల్ A19 ప్రాసెసర్‌తో iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. కెమెరా కాన్ఫిగరేషన్‌లో 48MP మెయిన్ బ్యాక్ కెమెరా సెల్ఫీలు, వీడియో చాట్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్‌లో 4,005mAh బ్యాటరీ కూడా ఉంది. USB-C పోర్ట్ ద్వారా 20W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ IP68-రేటింగ్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ పరంగా ప్రొటెక్ట్ చేస్తుంది.
హై రిఫ్రెష్ రేట్, డిస్‌ప్లే అల్ట్రావైడ్, జూమ్ లెన్స్ కెమెరా కాన్ఫిగరేషన్‌లతో వస్తుంది. అంతేకాదు.. ఈ ఫోన్ నాచ్ డిజైన్ పాతదే అయినా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఎక్కువ కాలం మన్నికను అందించే ఫోన్ కోసం చూస్తుంటే ఐఫోన్ 17e బెస్ట్ ఆప్షన్. ప్రస్తుత సేల్ ధరకు కొనేసుకోవచ్చు.
