×
Ad

iPhone 18 Pro Max : ఐఫోన్ లవర్స్ మీకోసమే.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ వస్తోందోచ్.. కెమెరా, డిజైన్ ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

iPhone 18 Pro Max : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి పండగే పండగ.. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.. ఓసారి లుక్కేయండి.

iPhone 18 Pro Max Sale

iPhone 18 Pro Max : ఆపిల్ లవర్స్ పండగ చేస్కోండి.. అతి త్వరలో భారత మార్కెట్లోకి ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ వచ్చేస్తోంది. వచ్చే ఏడాదిలో నెక్ట్స్ ఐఫోన్ లైనప్ నుంచి ఈ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ రానుంది. ఐఫోన్ 17 ప్రో మాదిరిగానే ఐఫోన్ 18 ప్రో కూడా అద్భుతమైన ఫీచర్లతో మరింత ఆకట్టుకునేలా ఉంటుంది.

ప్రస్తుతానికి, రాబోయే ఆపిల్ (iPhone 18 Pro Max) ఫ్లాగ్‌షిప్‌కు సంబంధించిన లీక్‌లు, ఊహాగానాలు ఇప్పటికే కీలక వివరాలను వెల్లడించాయి. అయితే, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ సంబంధించి లీకైన పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..

ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ కెమెరా, డిజైన్ :
ఆపిల్ ఐఫోన్ 18 ప్రోలో డిజైన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. రాబోయే ఐఫోన్ 18 ప్రో కూడా ఇలాంటి డిజైన్ కలిగి ఉండొచ్చు. అయితే, లాంచ్ సమయంలో కొన్ని కొత్త కలర్ ఆప్షన్లు అందుబాటులోకి రావచ్చు. ఆపిల్ డివైజ్ మందం కొంచెం తగ్గించే అవకాశం ఉంది.

కెమెరా విషయానికి వస్తే.. ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ 48MP ప్రైమరీ షూటర్, 48MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉండవచ్చు. దీనికి సంబంధించిన లీక్‌లు ప్రైమరీ లెన్స్ వేరియబుల్ ఎపర్చర్ టెక్నాలజీతో వస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.

Read Also : Poco F8 Ultra Launch : కొత్త పోకో F8 అల్ట్రా వస్తోందోచ్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

ఐఫోన్ 18 ప్రో మాక్స్ స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ గత మోడల్ మాదిరిగానే 120Hz రిఫ్రెష్ రేట్‌తో ప్రోమోషన్ డిస్‌ప్లే ఉండొచ్చు. అంతేకాకుండా, ఈ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ ఆపిల్ A20 ప్రో ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఈ ఐఫోన్ బేస్ వేరియంట్ ఎప్పటిలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. మెరుగైన ఏఐ సామర్థ్యాలు, ఫోన్‌లో అప్‌గ్రేడ్ సిరిని కూడా చూడొచ్చు.

భారత్‌లో ఐఫోన్ 18 ప్రో మాక్స్ లాంచ్ తేదీ, ధర ఎంతంటే? :
సెప్టెంబర్ 2026లో ఆపిల్ ఐఫోన్ 18 ప్రో మాక్స్ లాంచ్ కానుంది. లాంచ్‌ ధర విషయానికొస్తే.. ఈ ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ భారతీయ మార్కెట్లో రూ. 1,64,900 ప్రారంభ ధరకు లాంచ్ కానుంది.