Poco F8 Ultra Launch : కొత్త పోకో F8 అల్ట్రా వస్తోందోచ్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Poco F8 Ultra Launch : పోకో అభిమానులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి పోకో F8 సిరీస్ రానుంది. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు, ధర వివరాలు లీక్ అయ్యాయి.

Poco F8 Ultra Launch : కొత్త పోకో F8 అల్ట్రా వస్తోందోచ్.. లాంచ్‌కు ముందే కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంత ఉండొచ్చంటే?

Poco F8 Ultra Launch

Updated On : November 19, 2025 / 2:43 PM IST

Poco F8 Ultra Launch : కొత్త పోకో ఫోన్ కొంటున్నారా? పోకో నుంచి పోకో F సిరీస్ వచ్చేస్తోంది. పోకో F8 అల్ట్రా అతి త్వరలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ పవర్‌హౌస్‌గా రాబోతుంది. పోకో F8 అల్ట్రా లేటెస్ట్ క్వాల్కమ్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌తో రానుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అనేక ఫీచర్లు లీక్‌ అయ్యాయి. పోకో F8 అల్ట్రా ఫోన్‌కు సంబంధించి అనేక స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై ఓసారి పరిశీలిద్దాం.

భారత్‌లో పోకో F8 అల్ట్రా ధర, లాంచ్ తేదీ (అంచనా) :
256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పోకో F8 అల్ట్రా ఫోన్ 12GB ర్యామ్ (Poco F8 Ultra Launch) వేరియంట్ భారత మార్కెట్లో రూ. 56,990కు లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎల్లో, బ్లాక్ రెండు వేర్వేరు కలర్ ఆప్షన్లు ఉండొచ్చు. లాంచ్ తేదీ విషయానికొస్తే.. ఈ ఫోన్ నవంబర్ 26, 2025న మధ్యాహ్నం 1:30 గంటలకు పోకో F8 ప్రోతో పాటు లాంచ్ కానుంది.

Read Also : PM Kisan 21st installment : పీఎం కిసాన్ 21వ విడత.. ఏ క్షణమైనా రూ. 2వేలు పడొచ్చు.. 70 లక్షల మంది పేర్లు తొలగింపు.. మీ పేరు, పేమెంట్ స్టేటస్ ఇలా చేక్ చేయండి!

పోకో F8 అల్ట్రా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
పోకో F8 అల్ట్రా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1.5K లేదా 2K ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో రావచ్చు. అంతేకాకుండా, ఈ పోకో ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP ప్రైమరీ లెన్స్, 50MP పెరిస్కోప్ లెన్స్ 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉండవచ్చు.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ పోకో ఫోన్ 50MP ఫ్రంట్ స్నాపర్‌ను కలిగి ఉండొచ్చు. పోకో F8 అల్ట్రా 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7000mAh బ్యాటరీతో పవర్‌ అందిస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుందని అంచనా. అయితే, లాంచ్ సమయంలో మాత్రమే పూర్తి స్పెషిఫికేషన్ల వివరాలు వెల్లడి కానున్నాయి.