PM Kisan 21st installment : పీఎం కిసాన్ 21వ విడత.. ఏ క్షణమైనా రూ. 2వేలు పడొచ్చు.. 70 లక్షల మంది పేర్లు తొలగింపు.. మీ పేరు, పేమెంట్ స్టేటస్ ఇలా చేక్ చేయండి!

PM-Kisan 21st instalment : పీఎం కిసాన్ పథకానికి అర్హతలేని 70లక్షల రైతుల పేర్లను జాబితా నుంచి తొలగించింది. ఈ లబ్ధిదారు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి.

PM Kisan 21st installment : పీఎం కిసాన్ 21వ విడత.. ఏ క్షణమైనా రూ. 2వేలు పడొచ్చు.. 70 లక్షల మంది పేర్లు తొలగింపు.. మీ పేరు, పేమెంట్ స్టేటస్ ఇలా చేక్ చేయండి!

PM-Kisan 21st instalment

Updated On : November 19, 2025 / 1:56 PM IST

PM-Kisan 21st installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్ 21వ విడత విడుదల కానుంది. తమిళనాడులోని కోయంబత్తూరులో 9 కోట్ల మంది రైతులకు పీఎం నరేంద్ర మోదీ 21వ విడత పీఎం కిసాన్ విడుదల చేయనున్నారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 21వ విడత (PM Kisan 21st installment) ప్రయోజనాలు మరోసారి లక్షలాది మంది రైతుల ఖాతాలకు నేరుగా బదిలీ కానున్నాయి. లబ్ధిదారు రైతులు తమ పేమెంట్ స్టేటస్ ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేయవచ్చు. మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ నుంచి పీఎం కిసాన్ 21వ వాయిదా పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పీఎం కిసాన్ ప్రయోజనం ఎలా పొందాలంటే? :
పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాదిలో రైతులకు రూ. 6వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు రూ. 2వేలు చొప్పున 3 వాయిదాలలో బదిలీ చేస్తారు. ఈ పథకం ఫిబ్రవరి 24, 2019న ప్రారంభమైంది. గత విడతలో (ఏప్రిల్-జూలై FY26), 97.14 మిలియన్ల రైతులు డబ్బును అందుకున్నారు. డిసెంబర్-మార్చి 2024-25 కాలంలో ఈ మొత్తాన్ని 10.68 మిలియన్ల రైతులకు బదిలీ చేశారు.

ఈసారి 7 మిలియన్ల మంది లబ్ధిదారులు ఎందుకు తగ్గారంటే? :
లేటెస్ట్ 21వ విడతకు అర్హత ఉన్న రైతుల సంఖ్య సుమారు 7 మిలియన్లు తగ్గింది. ఈ పథకానికి అనర్హులైన రైతులను గుర్తించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అనేక వేల మంది రైతుల అకౌంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేసింది. ఈ రైతుల్లో చాలామంది ఈ పథకం ప్రమాణాలకు అనుగుణంగా లేరని మంత్రిత్వ శాఖ అనుమానిస్తోంది.

Read Also : iPhone 16 Price : అమెజాన్ బంపర్ ఆఫర్.. ఐఫోన్ 16పై ఊహించని డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే చౌకైన ధరకే..!

అర్హులైన రైతులందరినీ ఈ పథకంలో చేర్చడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ‘సాచురేషన్ డ్రైవ్’ను కూడా నిర్వహిస్తోంది. పీఎం కిసాన్ పోర్టల్‌లో జారీ చేసిన నోటీసులో వ్యవసాయ శాఖ పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలలో పేర్కొన్న మినహాయింపు ప్రమాణాల పరిధిలోకి వచ్చే కొన్ని అనుమానిత కేసులను గుర్తించినట్టు పేర్కొంది. రైతులు వెబ్‌సైట్‌లో వారి అర్హతను చెక్ చేసుకోవాలని సూచించారు.

పీఎం కిసాన్ ఎవరు అర్హులు కాదంటే? :
పీఎం కిసాన్ మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వాలు లబ్ధిదారులను గుర్తిస్తాయి. మినహాయింపు ప్రమాణాల పరిధిలోకి రాని పక్షంలో భూమిని కలిగి ఉన్న ఏ రైతు కుటుంబమైనా ఈ పథకంలో చేరవచ్చు.

  • ఆదాయ పరిమితిలోకి రాకపోవడం.
  • ఆదాయపు పన్ను చెల్లించే రైతులు
  • ప్రభుత్వ ఉద్యోగులు
  • ఎన్నికైన ప్రజా ప్రతినిధులు
  • నెలవారీ రూ. 10వేలు లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న వ్యక్తులు
  • అర్హత కలిగిన రైతులు మాత్రమే పీఎం కిసాన్ ప్రయోజనాలను పొందవచ్చు.

పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి :
ఈసారి పీఎం కిసాన్ పోర్టల్‌కు అనేక టెక్నికల్ అప్‌డేట్ అయ్యాయి.

  • మొబైల్ OTP అథెంటికేషన్
  • రియల్ టైమ్ బ్యాంక్ స్టేటస్ అప్‌డేట్స్
  • మీ ఆధార్, కేవైసీ ట్రాక్ చేసే సౌకర్యం
  • రైతులు ఏ CSC సెంటర్ విజిట్ చేయకుండానే నేరుగా ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేయవచ్చు.
  • పీఎం కిసాన్ పేమెంట్ చెక్ చేయడానికి ఈ కింది విధంగా ఫాలో చేయండి.
  • ముందుగా, అధికారిక పోర్టల్ (pmkisan.gov.in) ఓపెన్ చేయండి.
  • ‘Know Your Status’పై క్లిక్ చేయండి
  • ఈ ఆప్షన్ Farmer Corner సెక్షన్‌లో కనిపిస్తుంది.
  • రిజిస్ట్రేషన్ నంబర్‌ ఎంటర్ చేయండి.
  • మీ వద్ద రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోతే, “Know Your Registration Number” నుంచి పొందవచ్చు.
  • రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ఎంటర్ చేయండి.
  • స్క్రీన్‌పై స్టేటస్ కనిపిస్తుంది.