iPhone 16 Price : అమెజాన్ బంపర్ ఆఫర్.. ఐఫోన్ 16పై ఊహించని డిస్కౌంట్.. ఇలా కొన్నారంటే చౌకైన ధరకే..!
iPhone 16 Price : ఆపిల్ ఐఫోన్ 16పై అదిరిపోయే డిస్కౌంట్.. అమెజాన్‌లో ఈ అద్భుతమైన డీల్ ఎలా పొందాలంటే? ఫుల్ డిటెయిల్స్..
iPhone 16 Price
iPhone 16 Price : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ తర్వాత ఆపిల్ ఐఫోన్ 16 ధర భారీగా తగ్గింది. ఇప్పుడు అమెజాన్‌లో ఏకంగా రూ.10వేలు తగ్గింపు పొందింది. దాంతో అసలు ధర నుంచి రూ.69,999కి తగ్గింది.
ప్రస్తుతం ఈ ఐఫోన్ అసలు ధర కన్నా (iPhone 16 Price) భారీగా తగ్గింపు పొందింది. కొత్త ఐఫోన్ 16 మోడల్ 128GB వేరియంట్‌పై దాదాపు రూ.7వేలు సేవ్ చేసుకోవచ్చు. కొత్త ఐఫోన్ 16 కొనుగోలు చేయాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అమెజాన్‌లో ఐఫోన్ 16 ధర ఎంతంటే? :
ప్రస్తుతం అమెజాన్‌లో ఆపిల్ ఐఫోన్ 16 రూ.3వేల తగ్గింపుతో రూ.66,900కి లిస్ట్ అయింది. ఎస్బీఐ, ఐసీఐసీఐ లేదా ఏదైనా ఇతర బ్యాంక్ కార్డ్‌తో కస్టమర్‌లు రూ.4వేల వరకు ఆదా చేసుకోవచ్చు. మొత్తంమీద, ధర రూ.62,900కి తగ్గింపు పొందవచ్చు. ఏదైనా ఇతర అమెజాన్ డివైజ్ మాదిరిగానే మీరు నెలకు రూ.11,150 నుంచి (6 నెలల వరకు) ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
బ్యాంక్ కార్డ్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజులు లేదా ఇతర రుసుములను చెల్లించాల్సి రావచ్చు. ధర మరింత తగ్గింపు కోసం కస్టమర్లు పాత ఫోన్ రూ. 58,050 బెస్ట్ వాల్యూకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. అయితే, కచ్చితమైన ధర వర్కింగ్ కండిషన్స్, మీ డివైజ్ బ్రాండ్ వేరియంట్ ఆధారంగా వాల్యూ ఉంటుంది. ఆసక్తిగల కస్టమర్లు అదనపు రుసుముతో ఎక్స్‌టెండెడ్ వారంటీలు, ఇతర సర్వీసుల వంటి యాడ్-ఆన్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు.
ఆపిల్ ఐఫోన్ 16 స్పెసిఫికేషన్లు :
ఆపిల్ ఐఫోన్ 16 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ ప్యానెల్‌తో 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ ఐఫోన్ 8GB ర్యామ్ A18 చిప్‌సెట్‌తో వస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. ఈ ఐఫోన్ iOS 26 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది.
ముందున్న దాంతో పోలిస్తే మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఆప్టిక్స్ పరంగా ఈ ఐఫోన్ 48MP ఫ్యూజన్ కెమెరా, డ్యూయల్ రియర్ కెమెరాతో పాటు 12MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో వస్తుంది. సెల్ఫీల విషయానికి వస్తే.. ఈ ఐఫోన్ 12MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. నీటి నిరోధకత కోసం IP68 రేటింగ్‌తో కూడా వస్తుంది.
