×
Ad

Apple iPhone Air : వాలెంటైన్స్ డే ఆఫర్.. ఈ ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌పై ఏకంగా రూ. 25వేలు డిస్కౌంట్, ఇలా కొన్నారంటే?

Apple iPhone Air : ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర రూ.25వేలు తగ్గింపు పొందింది. విజయ్ సేల్స్ వాలెంటైన్స్ డే ఆఫర్‌లో భాగంగా ఈ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

  • Published On : February 13, 2026 / 08:11 PM IST

Apple iPhone Air

  • ఆపిల్ ఐఫోన్ ఎయిర్ ధర భారీ తగ్గింపు
  • విజయ్ సేల్స్‌లో వాలెంటైన్స్ డే ఆఫర్‌
  • ఐఫోన్ ఎయిర్ 256GB స్టోరేజ్ వెర్షన్ ధర రూ.1,19,900

Apple iPhone Air : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? సాధారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్ లాంచ్ అయ్యే ముందు పాత ఐఫోన్ ధర భారీగా తగ్గుతుంది. అయితే, గత ఏడాదిలో ప్రవేశపెట్టిన మోడల్ కేవలం 5 నెలల్లోనే దాదాపు రూ. 25వేలు తగ్గింది. అదే ఐఫోన్ ఎయిర్ మోడల్ అత్యంత ఆకర్షణీయంగా ఉంది. అత్యంత సన్నని ఐఫోన్ ఎయిర్ ధర ఎంత తగ్గిందో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్‌లో ఐఫోన్ ఎయిర్ ధర ఎంతంటే? :
గత ఏడాదిలో లాంచ్ అయిన ఐఫోన్ ఎయిర్ 256GB స్టోరేజ్ వెర్షన్ రూ.1,19,900కు రిటైల్ అవుతుంది. విజయ్ సేల్స్‌లో ఈ ఐఫోన్ ఎయిర్ 256GB స్టోరేజ్ వెర్షన్‌ ధర రూ.1,19,900తో రూ. 25వేలు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా రూ.94,900కు లభిస్తుంది. ఈ ఫోన్ వివో X200 ప్రో 5G, ఒప్పో ఫైండ్ N3 ఫ్లిప్, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5జీ వంటి ఫోన్లతో పోటీ పడుతోంది.

Read Also : Google Pixel 10a : పిక్సెల్ ఫ్యాన్స్‌కు పండగే.. కొత్త గూగుల్ పిక్సెల్ 10a వచ్చేస్తోందోచ్.. అన్ని ఫీచర్లు లీక్, ధర ఎంత ఉండొచ్చంటే?

రూ.4,500 వరకు డిస్కౌంట్ :
ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ లేదా యాక్సస్ బ్యాంక్ కార్డులతో ఫోన్‌ కొంటే అదనంగా రూ. 4వేలు తగ్గింపు పొందవచ్చు. అదే HSBC బ్యాంక్ కార్డుతో రూ. 4,500 తగ్గింపు పొందవచ్చు. 256GB మోడల్ ఐఫోన్ ఎయిర్ ధర రూ. 90,490కు లభిస్తుంది. ఫ్లాట్ రూ. 25వేలు డిస్కౌంట్, బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ రూ. 90,990 నుంచి (రూ. 4,500) తగ్గింపు పొందవచ్చు.

ఐఫోన్ ఎయిర్ ఫీచర్లు :
ఈ ఐఫోన్ వెర్షన్ 6.5-అంగుళాల సూపర్ రెటినా XDR స్క్రీన్‌ అందిస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇస్తుంది. A19 ప్రో ప్రాసెసర్ ఫోన్ స్పీడ్, మల్టీ టాస్కింగ్ అందిస్తుంది. ఫోన్ కెమెరా సెటప్‌లో 18MP ఫ్రంట్ కెమెరా, సింగిల్ 48MP బ్యాక్ సెన్సార్ ఉన్నాయి.