Apple is giving free earphones worth Rs 6,900 to select iPhone buyers
Apple Free Earphones : ఆపిల్ ఐఫోన్ కొనుగోలుదారులకు అదిరిపోయే పండుగ ఆఫర్ అందిస్తోంది. భారత మార్కెట్లో ప్రత్యేకించి ఆపిల్ దీపావళి సేల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఆపిల్ ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ కొనుగోలుదారులు పండుగ ఆఫర్‌ని సొంతం చేసుకోవచ్చు. ఈ మోడల్ ప్రతి కొనుగోలుపై కస్టమర్‌లు రూ. 6,900 విలువైన లిమిటెడ్-ఎడిషన్ బీట్స్ సోలో బడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు. ఇయర్‌బడ్‌లు ఆర్టిస్ట్ అక్విబ్ వానీ రూపొందించిన ప్రత్యేక ప్యాకేజింగ్‌లో వస్తాయి. ఈ ఆఫర్ కేవలం 2 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఆపిల్ అధికారిక స్టోర్, వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంటుంది. ఈ డీల్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్‌లను మినహాయించినప్పటికీ, కొనుగోలుదారులు 12 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల వంటి ఇతర బెనిఫిట్స్ పొందవచ్చు. భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.69,900గా నిర్ణయించింది.
ఐఫోన్ 15పై బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్ లేదు. కొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత ఆపిల్ ఇటీవల ఐఫోన్ 15 సిరీస్ ధరను రూ. 10వేలు తగ్గించింది. ఆపిల్ దీపావళి సేల్‌లో భాగంగా కంపెనీ ఐఫోన్ 15 ఉన్న వినియోగదారులకు ఫ్రీ పెయిర్ ఇయర్‌బడ్‌లను కూడా అందిస్తుంది.
ఈ కొత్త బీట్స్ బ్రాండ్ ఇటీవలే మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించింది. ఇది ఆపిల్ యాజమాన్యంలోనే ఉంది. కంపెనీ ఇటీవల బీట్స్ బ్రాండింగ్ కింద మూడు ప్రొడక్టులను ప్రవేశపెట్టింది. ఇందులో బీట్స్ సోలో 4 ఆన్-ఇయర్ హెడ్‌ఫోన్‌లు, బీట్స్ పిల్ బ్లూటూత్ స్పీకర్ ఉన్నాయి. ఆపిల్ ఇప్పుడు ఐఫోన్ 15తో బీట్స్ సోలో 4 కస్టమైజడ్ వెర్షన్‌ను అందిస్తోంది. అక్టోబర్ 4 తర్వాత విక్రయం ఉండదు. ఈ దీపావళి ఆఫర్ కొత్త బీట్స్ బ్రాండ్‌ను ప్రమోట్ చేసే వ్యూహం కూడా కావచ్చు.
అయితే, ఐఫోన్ 16 కొనుగోలు చేసే యూజర్లు ఆపిల్ స్టోర్‌లో కొంత డిస్కౌంట్ పొందవచ్చు. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లపై రూ. 5వేల డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. ఈ ఆఫర్ ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16ప్రో మ్యాక్స్ కూడా వర్తిస్తుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్‌లను కొనుగోలు చేసే యూజర్లు రూ. 3వేల బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. చివరగా, ఐఫోన్ ఎస్ఈ కూడా రూ. 2వేలు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌తో వస్తుంది.