Apple March Event 2026: ఆపిల్ ఐఫోన్ 17e వచ్చేస్తోంది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్, భారత్ సహా ఏయే దేశాల్లో ధర ఎంత ఉండొచ్చంటే?
Apple March Event 2026 : ఆపిల్ ఐఫోన్ 17e త్వరలో లాంచ్ అవుతుందని అంచనా. భారత్, యూఎస్ఏ, యూఏఈ వంటి కీలక మార్కెట్లలో లాంచ్ తేదీ, ధరపై భారీ అంచనాలు నెలకొన్నాయి..
- Sreehari A
- Published On : March 2, 2026 / 06:24 PM IST
Apple March Event 2026
Apple March Event 2026 : ఆపిల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. అతి త్వరలో ఆపిల్ మార్చ్ ఈవెంట్ 2026 జరుగనుంది. ఈ సందర్భంగా అనేక ఆపిల్ ప్రొడక్టులు లాంచ్ కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. ఈ వారం మార్చి 4, 2026న కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం మెయిన్ ప్రొడక్టు రిలీజ్ చేయనుంది.
ఆపిల్ 2026 లాంచ్ క్యాలెండర్ కూడా ప్రకటించింది. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా ‘ఆపిల్ లాంచ్’ కమింగ్ సూన్ (Apple March Event 2026) హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టు పెట్టారు. ఆపిల్ మార్చి 4 (బుధవారం) న్యూయార్క్, షాంఘై, లండన్‌లో లాంచ్ ఈవెంట్‌లను షెడ్యూల్ చేసింది. ఆపిల్ అదే రోజున కొత్త ప్రొడక్టులను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు.
ఈ మీడియా ఈవెంట్ల సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 16eకి కొత్త అప్ గ్రేడ్ వెర్షన్ ఐఫోన్ 17e, ఐప్యాడ్ పోర్ట్‌ఫోలియోలో కొత్త ప్రొడక్టులు లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాక్ రూమర్స్ నివేదిక ప్రకారం.. తక్కువ ధరలో ఐఫోన్ 17e వస్తుందని చాలా హైప్ క్రియేట్ అయింది.
ఐఫోన్ 17ఇ లాంచ్ :
ఆపిల్ ఐఫోన్ 17e మొత్తం లైనప్‌లో అద్భుతమైన ఫోన్. ఎందుకంటే.. ఐఫోన్ 17 సిరీస్‌లో చివరి ప్రొడక్టు ఇదే. అందులోనూ సరసమైన ధరకే వస్తుంది. ఐఫోన్ 16e తర్వాత రాబోయే ఐఫోన్ కూడా. ఈ మార్చిలో లండన్, షాంఘై, న్యూయార్క్ వంటి వివిధ నగరాల్లో ఐఫోన్ 17e నేరుగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ఐఫోన్ 17e ధర, కలర్ ఆప్షన్లు, సైజు, కెమెరా, స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 17e లావెండర్, వైట్, బ్లాక్ అనే 3 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లాంచ్ అవుతుందని పుకార్లు ఉన్నాయి. ధరల విషయానికి వస్తే.. గత లీక్‌ల ప్రకారం ఈ ఐఫోన్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ భారత మార్కెట్లో రూ.60వేల నుంచి రూ.65వేల మధ్య లభిస్తుందని సూచిస్తున్నాయి.
ఆపిల్ ఐఫోన్ 17e మోడల్ 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్‌తో సన్నని బెజెల్స్, డైనమిక్ ఐలాండ్‌తో రానుంది. ఈ ఐఫోన్ 8mm చుట్టూ మందం ఉంటుందని అంచనా. చాలావరకు ఆపిల్ A19 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.
ఈ హ్యాండ్‌సెట్ 4005mAh బ్యాటరీతో రానుంది. బ్యాక్ సైడ్ సింగిల్ 48MP కెమెరా, 12MP ఫ్రంట్ స్నాపర్ ఉండవచ్చు. ఐఫోన్ 17 మోడల్స్ అప్‌గ్రేడ్ 18MP సెంటర్ స్టేజ్ ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వచ్చాయి. అయితే ఐఫోన్ 17e, ఐఫోన్ 16e మాదిరిగా అదే 12MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వస్తుందని పుకార్లు సూచిస్తున్నాయి.
ఐఫోన్ 17e ధర (అంచనా) :
ధర విషయానికొస్తే.. భారత మార్కెట్లో ఐఫోన్ 17e రూ.60,000 నుంచి రూ.65,000 మధ్య ధరకు లభిస్తుందని లీక్‌లు సూచిస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్‌లో, ఫోన్ 599 డాలర్లకి, దుబాయ్‌లో AED 2,199కి లాంచ్ కానుంది.
