Apple iPhone 18 Launch : ఆపిల్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. రూ.1.20 లక్షలు దాటనున్న ఐఫోన్ 18? ధర, ఫీచర్లపై లేటెస్ట్ లీక్స్!

Apple iPhone 18 Launch : ఆపిల్ ఐఫోన్ 18 ధర భారత్‌లో రూ.1.20 లక్షల వరకు ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి.. మార్చి 2027లో లాంచ్ అవుతుందని అంచనా. A20 చిప్‌సెట్, 120Hz డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ ఫీచర్లపై పూర్తి వివరాలివే..

Apple iPhone 18 Launch

  • ఐఫోన్ 18 వచ్చేస్తోంది.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
  • బడ్జెట్‌కు బైబై చెప్పాల్సిందేనా? ఐఫోన్ 18 ధరపై భారీ అంచనాలు
  • 120Hz డిస్‌ప్లే, కొత్త A20 చిప్.. ఐఫోన్ 18లో అదిరిపోయే ఫీచర్లు

Apple iPhone 18 Launch : ఆపిల్ ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీ బడ్జెట్‌ను మరోసారి చెక్ చేసుకోవాల్సిందే.. ఎందుకంటే, అతి త్వరలో మార్కెట్లోకి ఐఫోన్ 18 రానుందని ప్రచారం జరుగుతోంది. ఐఫోన్ 18 ధర ఏకంగా రూ.1.20 లక్షల వరకు ఉండొచ్చని లీకులు సూచిస్తున్నాయి. అయితే, ఈ ధరను ఆపిల్ అధికారికంగా ప్రకటించలేదు. పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

మార్చి 2027లో ఐఫోన్ 18 లాంచ్? :
ప్రస్తుతం నివేదికల ప్రకారం.. ఆపిల్ స్టాండర్డ్ ఐఫోన్ 18ను 2027 మార్చిలో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఐఫోన్ 18e, ఐఫోన్ ఎయిర్ 2 మోడళ్లతో పాటు ఈ ఫోన్ కూడా మార్కెట్లోకి రావచ్చని టాక్ వినిపిస్తోంది. ఫోన్ తయారీ నవంబర్ 2026 చివర్లో ప్రారంభమయ్యే అవకాశముందని సమాచారం. అయితే, లాంచ్ తేదీపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read Also : Google Diwali Sale 2026 : గూగుల్ పండుగ ఆఫర్లు.. ఈ పిక్సెల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. బ్యాంక్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా!

ధర రూ.1 లక్ష పైనేనా? :
భారత్‌లో ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.79,900 కాగా, ప్రస్తుతం అధికారిక ధర రూ.99,900కు చేరినట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఐఫోన్ 18 ధర రూ.1,10,990 నుంచి రూ.1,19,990 మధ్య ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. అదే నిజమైతే.. ఇది ఆపిల్ లాంచ్ చేసే అత్యంత ఖరీదైన స్టాండర్డ్ ఐఫోన్‌లలో ఇదొకటిగా ఉండొచ్చు.

ఫీచర్లు ఎలా ఉండొచ్చంటే? :
ఐఫోన్ 18లో 6.3 అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండొచ్చని అంచనా. డైనమిక్ ఐలాండ్ సైజును కూడా తగ్గించే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి.

ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే..
2nm టెక్నాలజీతో A20 చిప్‌సెట్‌ను అందించే అవకాశం ఉంది. ర్యామ్ విషయంలో 9GB లేదా 12GB ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఫొటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరాలు, C2 మోడెమ్, అద్భుతమైన బ్యాటరీ, కొత్త కలర్ ఆప్షన్లు కూడా ఉండొచ్చు.

Note : ప్రస్తుతానికి ఇవన్నీ లీకులు, అంచనాలు మాత్రమే. ఐఫోన్ 18 ధర, ఫీచర్లు, లాంచ్ తేదీపై ఆపిల్ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే..