Asus Zenbook 14 OLED Laptop : గ్రేట్ బ్యాటరీ లైఫ్‌తో అసూస్ జెన్‌బుక్ 14 ల్యాప్‌టాప్.. అదిరిపోయే ఫీచర్లు.. ఏ వేరియంట్ ధర ఎంతంటే?

Asus Zenbook 14 OLED Laptop : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? గ్రేట్ బ్యాటరీ లైఫ్‌తో అసూస్ బ్రాండ్ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్ వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Asus launches ASUS Zenbook 14 OLED Laptop in India

Asus Zenbook 14 OLED Laptop : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తున్నారా? అసూస్ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. గ్రేట్ బ్యాటరీ లైఫ్‌‌తో అసూస్ జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ (UX3405) ల్యాప్‌టాప్‌ను బుధవారం (జనవరి 24) కంపెనీ విష్కరించింది. అసూస్ ల్యాప్‌టాప్ ఇంటెల్ ఈవీఓ ప్లాట్‌ఫారమ్‌లో ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్‌తో రన్ అయ్యేలా అప్‌డేట్ అయింది.

3కె రిజల్యూషన్‌తో 14-అంగుళాల టచ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అసూస్ జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ డాల్బీ అట్మోస్ టెక్నాలజీతో కూడిన డ్యూయల్ స్పీకర్‌లు, ఎర్గోసెన్స్ కీబోర్డ్ ఉన్నాయి. వై-ఫై 6ఈ రెండు థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లతో సహా లేటెస్ట్ కనెక్టివిటీ ఆప్షన్లను కలిగి ఉంది. అసూస్ జెన్‌బుక్14 ఓఎల్ఈడీ విండోస్ 11 హోమ్‌పై రన్ అవుతుంది. 75డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీతో సపోర్టు అందిస్తుంది. 32జీబీ వరకు ర్యామ్ 1టీబీ వరకు స్టోరేజీని కూడా కలిగి ఉంటుంది.

అసూస్ జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ స్పెసిఫికేషన్లు :
అసూస్ జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ విండోస్ 11 హోమ్‌తో ప్రీలోడ్ అవుతుంది. 14-అంగుళాల 3కె (1,800×2,880 పిక్సెల్‌లు) ఓఎల్ఈడీ టచ్ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 16:10 యాస్పెక్ట్ రేషియో, 87 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, ఒక ఫీచర్‌ని కలిగి ఉంది. గరిష్ట ప్రకాశం స్థాయి 550 నిట్స్, స్క్రీన్ డిస్‌ప్లే హెచ్‌డీఆర్ ట్రూ బ్లాక్ 600 సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది. డీసీఐ-పీ3 కలర్ 100 శాతం కవరేజీని అందిస్తుంది. 60హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్-హెచ్‌డీ (1,200X1,920 పిక్సెల్) ఓఎల్ఈడీ నాన్-టచ్ డిస్‌ప్లేలో కూడా అందుబాటులో ఉంది.

Read Also : Honda NX500 Bike Launch : కొత్త బైక్ కొంటున్నారా? దిమ్మతిరిగే ఫీచర్లతో హోండా NX500 అడ్వెంచర్ బైక్.. బుకింగ్స్ ఓపెన్.. ధర ఎంతంటే?

అసూస్ ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్‌తో అనుసంధానమైన ఏఐ-ఆధారిత ఇంటెల్ ఈవోఓ ప్లాట్‌ఫారమ్‌తో జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ‌ని అందిస్తోంది. ల్యాప్‌టాప్‌ను ఇంటెల్ కోర్ అల్ట్రా 7 155-హెచ్ ప్రాసెసర్ ఆప్షన్ లేదా ఇంటెల్ కోర్ అల్ట్రా 5 125-హెచ్ ప్రాసెసర్ ఆప్షన్‌తోకాన్ఫిగర్ చేయవచ్చు. 32జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ఆన్‌బోర్డ్ ర్యామ్‌ని ప్యాక్ చేస్తుంది. మీరు పీసీఐఈ ఎన్‌వీఎమ్ఈ ఎం.2 ఎస్ఎస్‌డీ స్టోరేజీ 1టీబీ వరకు పొందుతారు. ఈ ల్యాప్‌టాప్‌లో డ్యూయల్ న్యూట్రల్ కంప్యూట్ ఇంజన్, డెడికేటెడ్ లో-పవర్ ఏఐ ఇంజన్ ఉన్నాయి.

ఇంకా, అసూస్ జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ యాంబియంట్ లైట్, కలర్ సెన్సార్‌తో పూర్తి-హెచ్‌డీ ఐఆర్ వెబ్‌క్యామ్‌ను కలిగి ఉంది. ఇందులో రెండు థండర్‌బోల్ట్ 4 యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లు, యూఎస్‌బీ 3.2 జనరేషన్ 1 టైప్-ఎ పోర్ట్, హెచ్‌డీఎంఐ 2.1 పోర్ట్ హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లో బ్లూటూత్ 5.3, వై-ఫై 6ఈ కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ల్యాప్‌టాప్‌లో డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్‌తో హర్మాన్ కార్డాన్-సర్టిఫైడ్ స్పీకర్‌లు రెండు ఉన్నాయి. ఇందులో ఎర్గోసెన్స్ కీబోర్డ్ కూడా ఉంది.

ASUS Zenbook 14 OLED Laptop

ఇది కోర్టానా, అలెక్సా వాయిస్-రికగ్నిషన్ సపోర్ట్‌తో ఇంటర్నల్ మైక్రోఫోన్‌లను కలిగి ఉంది. అసూస్ జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ 65డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 75డబ్ల్యూహెచ్ఆర్ లిథియం పాలిమర్ బ్యాటరీని కలిగి ఉంది. బ్యాటరీ సెటప్ ఒక ఛార్జ్‌పై 15 గంటల వరకు అన్‌ప్లగ్డ్ ఆపరేషన్‌ను అందించగలదు. ఈ డివైజ్ కొలతలు 312.42×220.05×14.9ఎమ్ఎమ్, బరువు 1.2 కిలోగ్రాములు ఉంటుంది.

భారత్‌లో అసూస్ జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ ధర, లభ్యత :
భారత మార్కెట్లో అప్‌డేట్ చేసిన అసూస్ జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ (UX3405) బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 99,990 ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ఏడు మోడళ్లను కలిగి ఉంది. హై ర్యామ్, సీపీయూ ఆప్షన్‌తో టాప్-ఎండ్ వెర్షన్ ధర రూ. 1,09,990 ఉంటుంది. అసూస్ జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ అన్ని వేరియంట్‌లు జనవరి 31 నుంచి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఆసుస్ ఇ-షాప్ అలాగే ఆన్‌లైన్ స్టోర్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. అసూస్ జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా విభిన్న స్పెసిఫికేషన్‌లు, ధరలతో మోడల్‌ల శ్రేణిని అందిస్తోంది. భారత్‌లో అసూస్ జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ మోడల్‌ల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ UX3405MA-PZ552M/S : రూ. 99,990.
  • జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ UX3405MA-PZ752WS : రూ. 1,14,990.
  • జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ UX3405MA-PZ762WS : రూ. 1,20,990.
  • జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ UX3405MA-PZ551WS : రూ. 99,990.
  • జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ UX3405MA-PZ751WS : రూ. 1,14,990.
  • జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ UX3405MA-QD552WS : రూ. 96,990.
  • జెన్‌బుక్ 14 ఓఎల్ఈడీ UX3405MA-QD752WS : రూ. 1,09,990.

పైన పేర్కొన్న అన్ని వేరియంట్‌లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ మోడల్‌లలో దేనినైనా ఆన్‌లైన్‌లో అసూస్ ఇ-షాప్ నుంచి లేదా ఏదైనా అసూస్ ప్రత్యేక/ఆర్ఓజీ స్టోర్‌లు, రిలయన్స్ డిజిటల్ లేదా ఇతర అసూస్ అధీకృత డీలర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.

Read Also : Xiaomi 14 Flagship Smartphone : భారత్‌కు త్వరలో షావోమీ 14 కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌‌ఫోన్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?