Best 3 Motorola Phones : సూపర్ ఫోన్లు బ్రో.. రూ. 15వేల లోపు బెస్ట్ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లు.. ఇలాంటి డీల్స్ మళ్లీ జన్మలో రావు!
Best 3 Motorola Phones : 7000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో మోటోరోలా కిల్లర్ ఫోన్‌లు రూ. 8999 నుంచి అందుబాటులో ఉన్నాయి. మీరు తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఈ మోటోరోలా ఫోన్లు కొనేసుకోవచ్చు.
- Sreehari A
- Published On : March 30, 2026 / 08:22 PM IST
Best 3 Motorola Phones
- మోటోరోలా ఫోన్లు అత్యంత సరసమైన ధరకే కొనేసుకోవచ్చు
- రూ. 15వేల లోపు ధరలో బెస్ట్ 3 మోటోరోలా ఫోన్లు
- భారీ 7000mAh బ్యాటరీ, 24GB ర్యామ్, 50MP కెమెరాలు
Best 3 Motorola Phones : మోటోరోలా ఫ్యాన్స్ మీకోసమే.. మంచి మోటోరోలా ఫోన్ కొనాలని చూస్తున్నారా? మూడు బెస్ట్ మోటోరోలా ఫోన్లు తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లకు హై ర్యామ్, అద్భుతమైన కెమెరాలు, పవర్ ఫుల్ ప్రాసెసర్ అందిస్తాయి.
ఈ లిస్టులో అత్యంత చౌకైన మోటరోలా స్మార్ట్‌ఫోన్ ధర రూ. 8,999కు లభిస్తోంది. ఈ లిస్టులో మోటోరోలా G05, మోటరోలా G35 5జీ, మోటోరోలా G45 5జీ ఉన్నాయి. ఈ అద్భుతమైన మోటోరోలా స్మార్ట్‌ఫోన్‌లపై వివరంగా పరిశీలిద్దాం..
మోటోరోలా G35 5జీ ధర, ఫీచర్లు :
మోటోరోలా G35 5జీ అద్భుతమైన ఆప్షన్. ఈ ఫోన్ 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 11,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో భారీ 6.7-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. కెమెరా విషయానికొస్తే.. ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
ఇందులో 50MP మెయిన్ కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 12GB వరకు ర్యామ్ ఉంది. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే 20W టర్బో ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 5000mAh బ్యాటరీ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్, ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
మోటోరోలా G57 పవర్ 5జీ ధర, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌లో భారీ 6.7-అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,999 కి కొనుగోలు చేయవచ్చు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ ప్రాసెసర్ ఉంటుందని అంచనా. కెమెరా పరంగా చూస్తే ఇందులో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. హై క్వాలిటీ ఫొటోలను తీయొచ్చు.
ఇందులో 8MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. తక్కువ కాంతిలో కూడా అద్భుతమైన ఫొటోలను తీయొచ్చు. బ్యాక్ కెమెరా 2K వరకు వీడియోను రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా 8MP కెమెరానే ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్, MIL-STD-810H రేటింగ్‌తో వస్తుంది. ఇందులో 7000mAh భారీ బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు.
మోటోరోలా G06 పవర్ ధర, ఫీచర్లు :
మోటోరోలా G06 పవర్ ఫోన్ రూ.8,999 ధరకు లభిస్తోంది. 6.5-అంగుళాల డిస్‌ప్లే, హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో స్మూత్-స్క్రోలింగ్ LCD స్క్రీన్ అందిస్తుంది. ఇందులో 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పవర్‌ఫుల్ 7000mAh బ్యాటరీ ఉంది.
కెమెరా విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 50MP ఏఐ కెమెరా సిస్టమ్ ఉంది. బడ్జెట్ కేటగిరీలో హై క్వాలిటీ ఫొటోగ్రఫీ కోసం ఆప్టిమైజ్ అయింది. మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్, వేగన్ లెదర్ ఫినిష్, IP64 డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ అందిస్తుంది.
