Samsung Galaxy Phones : శాంసంగ్ లవర్స్ ఎగిరిగంతేసే ఆఫర్లు.. ఈ కొత్త శాంసంగ్ 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. క్యాష్ బ్యాక్ కూడా..!
Samsung Galaxy A Series : శాంసంగ్ ఇండియా గెలాక్సీ A57 5G, గెలాక్సీ A37 5G ధర, ప్రారంభ ఆఫర్లను వెల్లడించింది. వినియోగదారులు రూ. 3,000 క్యాష్‌బ్యాక్, డౌన్ పేమెంట్ లేకుండా 24 నెలల జీరో వడ్డీ ఈఎంఐ ప్లాన్, రూ. 3,000 అప్‌గ్రేడ్ బోనస్ ఆఫర్లను అందిస్తోంది.
Samsung Galaxy A Series
- శాంసంగ్ గెలాక్సీ ఎ సిరీస్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు
- 50MP మెయిన్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 5,000mAh బ్యాటరీ
- 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ప్లే
- రూ. 3వేలు క్యాష్‌బ్యాక్, 24 నెలల జీరో వడ్డీ ఈఎంఐ, రూ. 3వేలు అప్‌గ్రేడ్ బోనస్
Samsung Galaxy A Series : కొత్త శాంసంగ్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్లు.. శాంసంగ్ లవర్స్ కోసం తక్కువ ధరకే అద్భుతమైన ఫోన్లు లభిస్తున్నాయి. శాంసంగ్, గెలాక్సీ A57 5జీ, గెలాక్సీ A37 5జీ ధరలు, లాంచ్ ఆఫర్లను కంపెనీ వెల్లడించింది.
ఈ రెండు స్మార్ట్ఫోన్లు ఇటీవలే లాంచ్ అయ్యాయి. ఈ కొత్త గెలాక్సీ A సిరీస్ ఫోన్లు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ప్లేతో వచ్చాయి. ఎక్సినోస్ చిప్సెట్తో రన్ అవుతాయి.
ఇందులో 50MP మెయిన్ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5పై రన్ అవుతాయి. శాంసంగ్ కొనుగోలుదారులకు క్యాష్‌బ్యాక్, వడ్డీ లేని ఈఎంఐ, అప్‌గ్రేడ్ బోనస్‌ల వంటి బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. ధరలు, ఆఫర్లను మరింత వివరంగా పరిశీలిద్దాం..
వివిధ మోడళ్ల ధర ఎంతంటే? :
భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ 8GB+256GB మోడల్ ధర రూ. 56,999 కాగా, 12GB వేరియంట్ ధర రూ. 62,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ధరలు 8GB+128GB మోడల్‌కు ధర రూ. 41,999, 8GB+256GB మోడల్‌కు ధర రూ. 47,499, 12GB+256GB మోడల్‌కు రూ. 52,499 నుంచి ప్రారంభమవుతాయి.
శాంసంగ్ గెలాక్సీ A57 5జీ, శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫోన్లు రిటైల్ స్టోర్లు, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, శాంసంగ్ ఇండియా వెబ్సైట్, ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్లు ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి.
ఈ ఫోన్లపై కంపెనీ ఆఫర్లను ప్రకటించింది. వినియోగదారులు రూ. 3వేలు బ్యాంక్ లేదా యూపీఐ క్యాష్‌బ్యాక్, డౌన్ పేమెంట్ లేకుండా 24 నెలల జీరో వడ్డీ ఈఎంఐ ప్లాన్ లేదా రూ. 3వేలు అప్‌గ్రేడ్ బోనస్ వంటి ఆఫర్లను పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఫోన్ ఆసమ్ నేవీ, ఆసమ్ ఐసీ బ్లూ, ఆసమ్ లైలాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మరోవైపు, శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఆసమ్ లావెండర్, ఆసమ్ చార్కోల్, ఆసమ్ గ్రేగ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్లు ఇప్పుడు అమెజాన్‌లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. డెలివరీలు ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.
గెలాక్సీ A57 5జీ, గెలాక్సీ A37 5జీ ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ A57 5జీ, శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫోన్లలో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ సూపర్ అమోల్డ్ ప్లస్ డిస్ప్లే ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ A57 5జీ ఎక్సినోస్ 1680 చిప్సెట్తో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఎక్సినోస్ 1480 చిప్సెట్తో వస్తుంది.
ఈ రెండు ఫోన్లు 12GB వరకు LPDDR5X ర్యామ్, 256GB వరకు UFS 3.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు సపోర్టు ఇస్తాయి. ఆండ్రాయిడ్ 8.5 ఆధారిత వన్ యూఐ 16పై రన్ అవుతాయి. ఈ రెండు ఫోన్లు 6 OS అప్‌గ్రేడ్‌లకు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్లు పొందుతాయి. ఇందులో శాంసంగ్ బిక్స్బీ, జెమిని, పెర్ప్లెక్సిటీ వంటి ఏఐ ఆధారిత టూల్స్ కూడా ఉన్నాయి.
కెమెరాల విషయానికి వస్తే..
గెలాక్సీ A57 5G, గెలాక్సీ A37 5G ఫోన్లలో 50MP మెయిన్ కెమెరా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A57 5జీలో 12MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. గెలాక్సీ A37 5జీలో 8MP అల్ట్రావైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ 2 ఫోన్లలోనూ 12MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ ఫోన్లలో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0 టెక్నాలజీ, 5,000mAh బ్యాటరీ ఉంది. సుమారు 30 నిమిషాల్లో జీరో నుంచి 60 శాతం వరకు ఛార్జ్ చేస్తాయి. ఈ ఫోన్లు దుమ్ము, నీటి నిరోధకతకు IP68 రేటింగ్ పొందాయి. సేఫ్టీ కోసం నాక్స్ వాల్ట్ ఫీచర్ కూడా ఉంది.
