Best 5G SmartPhones : రూ. 15వేల లోపు కొత్త 5G ఫోన్ కావాలా? Mivi, HMD, శాంసంగ్ ఫోన్లలో ఏది కొంటే బెటర్? ఫుల్ డిటెయిల్స్!
Best 5G SmartPhones : తక్కువ ధరలో మంచి ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? మీకోసం మివి, హెచ్ఎండీ, శాంసంగ్ ఫోన్లు చౌకైన ధరకే లభిస్తున్నాయి. ఇందులో మీకు ఏది బెటర్ అనేది మీరే డిసైడ్ అవ్వండి..
- Sreehari A
- Published on- October 21, 2026 / 06:33 PM IST
Best 5G SmartPhones
- మివి వన్ 5జీ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ సెటప్
- హెచ్ఎండీ వైబ్ 2 5జీలో యునిసోక్ T8200 ప్రాసెసర్‌ను అందించారు
- శాంసంగ్ గెలాక్సీ ఎఫ్16 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్
Best 5G SmartPhones : మీరు రూ.15,000 లోపు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? మివి వన్ 5జీ, హెచ్ఎండీ వైబ్ 2 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్16 5జీ అందుబాటులో ఉన్నాయి. మివి వన్ 5జీ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్తో రన్ అవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్16 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. హెచ్ఎండీ వైబ్ 2 5జీ యూనిసోక్ T8200 ప్రాసెసర్‌తో (Best 5G SmartPhones) రన్ అవుతుంది. మివి వన్ 5జీ, హెచ్ఎండీ వైబ్ 2 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్16 5జీ స్పెసిఫికేషన్ల వివరాలేంటో ఓసారి పరిశీలిద్దాం..
మివి వన్ 5జీ vs హెచ్ఎమ్డీ వైబ్ 2 5జీ vs శాంసంగ్ గెలాక్సీ F16 5జీ :
ధర :
మివి వన్ 5జీ 4GB+128GB స్టోరేజ్ వేరియంట్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 12,999కి అందుబాటులో ఉంది.
హెచ్ఎండీ వైబ్ 2 5జీ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 13,999కి అందుబాటులో ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్16 5జీ 4GB+128GB స్టోరేజ్ వేరియంట్
ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 12,499కి లిస్ట్ అయింది.
డిస్ప్లే :
మివి వన్ 5జీ 1600×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.75-అంగుళాల HD+ LCD డిస్ప్లేతో వస్తుంది
హెచ్ఎండీ వైబ్ 2 5జీ కూడా 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.75-అంగుళాల HD+ వి-నాచ్ ఐపీఎస్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్16 5జీ ఫోన్ 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల Full HD+ సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది.
Read Also : Honor Win Turbo 2 : కొత్త హానర్ విన్ టర్బో2 చూశారా? 12070mAh బ్యాటరీ, 50MP కెమెరాతో అదుర్స్, ధర జస్ట్..!
బ్యాటరీ బ్యాకప్ :
మివి వన్ 5జీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ అందిస్తుంది
హెచ్ఎండీ వైబ్ 2 5జీ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ
శాంసంగ్ గెలాక్సీ F16 5జీ ఫోన్ 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ అందిస్తుంది
ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెసర్ :
మివి వన్ 5జీ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
హెచ్ఎండీ వైబ్ 2 5జీ యునిసోక్ T8200 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
శాంసంగ్ గెలాక్సీ F16 5జీ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ UI 7పై రన్ అవుతుంది.
కెమెరా సెటప్ :
మివి వన్ 5జీ బ్యాక్ సైడ్ ఎఫ్/1.8 అపర్చర్ ఎల్ఈడీ ఫ్లాష్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం, ఎఫ్/2.0 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా సెటప్
హెచ్ఎండీ వైబ్ 2 5జీలో కూడా 50MP రియర్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం అదే 8MP ఫ్రంట్ కెమెరా సెటప్
శాంసంగ్ గెలాక్సీ F16 5జీలో కూడా బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా 2MP మాక్రో కెమెరా
సెల్ఫీల కోసం భారీ 13MP ఫ్రంట్ కెమెరా
కనెక్టివిటీ ఆప్షన్లు :
మివి వన్ 5జీలో 5జీ, డ్యూయల్ 4G VoLTE, 3.5mm జాక్, Wi-Fi, బ్లూటూత్ 5.1, జీపీఎస్, యూఎస్బీ టైప్-సి పోర్ట్
హెచ్ఎండీ వైబ్ 2 5జీలో కూడా ఇలాంటి 5జీ, బ్లూటూత్ 5.0, Wi-Fi, జీపీఎస్, యూఎస్బీ టైప్-సి పోర్ట్
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్16 5జీలో కూడా 5జీ, 4జీ, Wi-Fi, బ్లూటూత్ 5.3, జీపీఎస్, USB టైప్-సి పోర్ట్
