Best Airtel Plans (Image Credit To Original Source)
Best Airtel Plans : ఎయిర్‌టెల్ కస్టమర్లకు పండగే పండగ.. యూజర్ల కోసం అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఎయిర్ టెల్ అందించే అన్ని ప్లాన్లలో బెస్ట్ ప్లాన్లు కూడా ఉన్నాయి. అందులో 1.5GB రోజువారీ డేటాతో వచ్చే ప్లాన్లు కూడా ఉన్నాయి.
ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తాయి. 84 రోజుల వ్యాలిడిటీ నెలకు దాదాపు 28 రోజులు.. దాదాపు 3 నెలల పాటు రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకే ఈ రీఛార్జ్ ప్లాన్లు బాగా పాపులర్ అయ్యాయి.. పూర్తి వివరాలపై ఓసారి లుక్కేయండి..
ఎయిర్‌టెల్ రూ.859 ప్లాన్ :
ఎయిర్‌టెల్ 84 రోజుల వ్యాలిడిటీతో రూ. 859 ప్లాన్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా, అన్ లిమిటెడ్ లోకల్, STD, రోమింగ్ కాల్స్ రోజుకు 100 SMS పొందవచ్చు. స్పామ్ ప్రొటెక్షన్, ఫ్రీ హలోట్యూన్స్ కూడా ఉన్నాయి.
Best Airtel Plans (Image Credit To Original Source)
ఎయిర్‌టెల్ రూ.799 ప్లాన్ :
తక్కువ ధరలో ప్లాన్ కోసం చూస్తుంటే.. రూ. 799 ప్లాన్ కూడా ఉంది. రోజుకు 1.5GB డేటా అందిస్తుంది. అయితే, ఈ ప్లాన్ 77 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. రూ. 859 ప్లాన్ మాదిరిగానే అన్ లిమిటెడ్ లోకల్, STD రోమింగ్ కాల్స్, రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. స్పామ్ ప్రొటెక్షన్, ఫ్రీ హాలోట్యూన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ఎయిర్‌టెల్ రూ.619 ప్లాన్ :
60 రోజుల ప్లాన్ లేదా 2 నెలల ప్లాన్ కోసం చూస్తుంటే.. ఎయిర్‌టెల్ రూ. 619 ప్లాన్ బెస్ట్ ప్లాన్. రోజుకు 1.5GB డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా అందిస్తుంది. స్పామ్ ప్రొటెక్షన్, ఫ్రీ హలోట్యూన్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే కూడా అందిస్తుంది.