ControlZ Anniversary Sale : వారెవ్వా.. ఇది కదా ఆఫర్.. కంట్రోల్‌జెడ్ వార్షికోత్సవ సేల్.. కొత్త ఐఫోన్లు జస్ట్ రూ.32వేల నుంచే..!

ControlZ Anniversary Sale : కంట్రోల్జ్ 6వ వార్షికోత్సవ సేల్‌ను ప్రకటించింది. జూలై 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఐఫోన్ 13, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 15 ప్రోతో సహా అనేక కొత్త ఐఫోన్ మోడళ్లు ప్రత్యేక ధరలకు లభిస్తున్నాయి.

ControlZ Anniversary Sale

  • కంట్రోల్జ్ వార్షికోత్సవ సేల్ జూలై 6 నుంచి జూలై 10 వరకు అందుబాటులో
  • ఐఫోన్ 13 నుంచి ఐఫోన్ 15 ప్రో వరకు ప్రత్యేక ధరల్లో కొనేసుకోవచ్చు
  • రీఫర్బిష్డ్ అన్ని ఐఫోన్‌లు 18 నెలల వారంటీతో వస్తాయి

ControlZ Anniversary Sale : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేవారికి బిగ్ గుడ్ న్యూస్.. ప్రస్తుతం మెమరీ చిప్ ధరల పెంపుతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రిన్యూవల్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే యూజర్లకు తక్కువ ధరకే కొత్త ఐఫోన్లు లభించనున్నాయి. ప్రీమియం రిన్యూవల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ కంట్రోల్జ్ ఇప్పుడు తమ కంపెనీ 6వ వార్షికోత్సవం సందర్భంగా ‘యాన్యువల్ సేల్’ను ప్రారంభించినట్లు ప్రకటించింది.

ఈ సేల్ జూలై 6 నుంచి జూలై 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఇందులో ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో వంటి మోడళ్లు ప్రత్యేక ధరలకు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ లిమిటెడ్ స్టాక్‌కు మాత్రమేనని, కేవలం అధికారిక వెబ్‌సైట్‌లోనే లభిస్తుందని కంపెనీ తెలిపింది.

ఐఫోన్ మోడళ్లపై ప్రత్యేక ధరలివే :
కంట్రోల్జ్ ప్రకారం.. ఈ సేల్ సమయంలో ప్రతిరోజూ వేర్వేరు ఐఫోన్ మోడళ్లపై ప్రత్యేక ధరలు అందుబాటులో ఉంటాయి. జూలై 6న ఐఫోన్ 13 ధర రూ. 31,999గా ఉంటుంది. జూలై 7న, ఐఫోన్ 13 ప్రో రూ. 43,499కి అందుబాటులో ఉంటుంది. జూలై 8న వినియోగదారులు ఐఫోన్ 14 ప్రోను రూ. 52,999కి కొనుగోలు చేయగలరు. జూలై 9న ఐఫోన్ 15 ధర రూ. 44,499గా, జూలై 10న, ఐఫోన్ 15 ప్రో ధర రూ. 66,499గా ఉంటుంది.

Read Also : Vivo X300e Launch : వివోనా మజాకా.. భారీ ఫీచర్లతో వివో X300e వస్తోందోచ్.. శాంసంగ్‌, షావోమీ, వన్‌ప్లస్‌కు దబిడిదిబిడే..!

ఆరేళ్లు పూర్తి చేసుకోవడం కంపెనీకే కీలక మైలురాయిగా కంట్రోల్జ్ వ్యవస్థాపకుడు యుగ్ భాటియా అన్నారు. క్వాలిటీ టెస్టింగ్, వారంటీతో సర్టిఫైడ్ రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్‌లను అందించడమే కంపెనీ లక్ష్యమని తెలిపారు. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరుగుతున్న వేళ ఇప్పుడు ఎక్కువ మంది వినియోగదారులు సర్టిఫైడ్ రీఫర్బిష్డ్ ఫోన్లను బెస్ట్ ఆప్షన్‌గా ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.

ఎక్కువ మొత్తంలో క్వాలిటీ టెస్టింగ్ తర్వాతే కంట్రోల్జ్ రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్‌లన్నింటినీ విక్రయిస్తుందని కంపెనీ పేర్కొంది. వినియోగదారులకు 18 నెలల వారంటీ కూడా అందిస్తున్నారు. ఈ విధానం ద్వారా భారత మార్కెట్లో ప్రీమియం రీఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను విస్తరిస్తున్నామని కంపెనీ చెబుతోంది.

తక్కువ ధరలో మంచి ప్రీమియం ఐఫోన్‌ కోసం చూస్తుంటే ఈ వార్షికోత్సవ సేల్ బెస్ట్ ఆప్షన్. అయితే, అన్ని ఆఫర్‌లు లిమిటెడ్ యూనిట్లకు మాత్రమేనని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. అందుకే స్టాక్ అయిపోకముందే మీకు ఇష్టమైన మోడల్‌ను కొనేసుకోవడం బెటర్.