Best Recharge Plans
Best Recharge Plans : నెలవారీ రీఛార్జ్ ప్లాన్లతో విసిగిపోయారా? తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? మీ నెట్‌వర్క్ ఏదైనా సరే.. అతి చౌకైన ధరకే అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక నెల కాదు.. రెండు నెలల పాటు రీఛార్జ్ చేయాల్సిన పనిలేదు.
ఈ రీఛార్జ్ ప్లాన్‌ల ప్రారంభ ధర రూ. 345. అంటే.. మీరు రోజుకు రూ. 6 కన్నా తక్కువ ధరకే డేటా, ఫోన్ కాల్స్ పొందవచ్చు. దాదాపు 2 నెలల పాటు రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే. మీరు మళ్లీ మళ్లీ రీఛార్జ్ కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.
మీది ఏ నెట్‌వర్క్ అయినా జియో, ఎయిర్‌టెల్, బిఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్లలో ఏదో ఒక ప్లాన్ ఎంచుకోవచ్చు. ఈ ప్లాన్ల ప్రారంభ ధర రూ. 345 నుంచి లభ్యమవుతున్నాయి. మీరు రూ. 6 కన్నా తక్కువ ధరకే రోజువారీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ రూ.345 ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ రూ.345 ప్లాన్‌లో పూర్తిగా 60 రోజుల వ్యాలిడిటీని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ ప్రతిరోజూ 1GB డేటాతో పాటు రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ రోజువారీ ధర రూ.5.75 చొప్పున రెండు నెలలకు రూ.345 చెల్లించాల్సి ఉంటుంది.
ఎయిర్‌టెల్ రూ.619 ప్లాన్ :
ఎయిర్‌టెల్ ధర రూ.619 ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. డేటా విషయానికి వస్తే.. ఈ ప్లాన్ రోజుకు 2.5GB డేటా బెనిఫిట్స్ అందిస్తుంది. దాంతో పాటు, 60 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ ప్లాన్ రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.
ఎయిర్‌టెల్ ధర రూ.649 ప్లాన్ :
ఈ ఎయిర్‌టెల్ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్ పొందవచ్చు. దాంతో పాటు, రోజుకు 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. డేటా విషయానికి వస్తే.. ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2GB డేటా బెనిఫిట్స్ పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ ధర రూ.347 ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ రూ.347 ప్లాన్ బెస్ట్ ఆప్షన్. ఈ ప్లాన్‌లో 56 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. మీరు ప్రతిరోజూ 2GB డేటా, రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు.
జియో ధర రూ.579 ప్లాన్ :
జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 1.5GB డేటా బెనిఫిట్స్‌తో వస్తుంది. మీకు 56 రోజుల వరకు వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో మీకు ఫ్రీ కాలింగ్, రోజుకు 100 SMS కూడా లభిస్తాయి. ఈ ప్లాన్‌లో జియో యాప్ బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.