Airtel New Plan : ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్ అదుర్స్.. సింగిల్ రీఛార్జ్‌తో 365 రోజులు ఎంజాయ్ చేయొచ్చు.. ఫ్రీ కాలింగ్ బెనిఫిట్స్..!
Airtel New Plan : ఎయిర్‌టెల్ పోర్ట్‌ఫోలియోలో 365 రోజుల పాటు సింగిల్ రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో ఫ్రీ కాలింగ్ ఆప్షన్ కూడా అందిస్తోంది. కొత్త రీఛార్జ్ ప్లాన్ ధర ఎంతంటే?

Airtel Prepaid Plans
Airtel New Plan : ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఎయిర్‌టెల్ 38 కోట్లకు పైగా యూజర్ల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. అనేక రకాల చౌకైన, ఖరీదైన ప్లాన్‌లను కూడా అందిస్తోంది. ఇటీవల నెలవారీ రీఛార్జ్ ప్లాన్‌లు ఖరీదైనవి కావడంతో వినియోగదారుల దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు.
కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎయిర్‌టెల్ పోర్ట్‌ఫోలియోలో లాంగ్ టైమ్ వ్యాలిడిటీతో కూడిన ప్లాన్‌లను కూడా పెంచింది. ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం రీఛార్జ్ ప్లాన్‌లను వివిధ కేటగిరీలుగా విభజించింది. ఎయిర్‌టెల్ ఏదైనా ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. 365 రోజుల వరకు ఎలాంటి రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ చౌకైన వార్షిక ప్లాన్‌లో ఫ్రీ కాలింగ్‌ను కూడా అందిస్తోంది.
ఎయిర్‌టెల్ రూ. 2240 ప్లాన్ :
ఎయిర్‌టెల్ ఇటీవలే తమ యూజర్ల కోసం రూ.2249 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ ఈ రీఛార్జ్ ప్లాన్ ఏడాది పొడవునా ఫ్రీ కాలింగ్ అందిస్తుంది. ఎయిర్‌టెల్ రూ.2249 ప్లాన్ ద్వారా కస్టమర్లకు 365 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఎయిర్‌టెల్ లోకల్, STD నెట్‌వర్క్‌లకు యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ అందిస్తుంది. కంపెనీ అన్ని నెట్‌వర్క్‌లకు మొత్తం 3600 ఫ్రీ SMS ఆప్షన్లను కూడా అందిస్తుంది.
ఫ్రీ కాలింగ్‌తో పాటు డేటా బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. డేటా బెనిఫిట్స్ విషయానికి వస్తే.. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో 12 నెలల పాటు మొత్తం 30GB డేటాను అందిస్తుంది. మీరు ఇంటర్నెట్ అవసరం లేకుంటే.. మరో చౌకైన ప్లాన్ కూడా ఉంది.
Read Also : Oppo A5 Pro Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కావాలా? ఏఐ ఫీచర్లతో ఒప్పో సరికొత్త 5G ఫోన్ చూశారా? ధర ఎంతో తెలుసా?
కొన్ని నెలల క్రితమే ట్రాయ్ టెలికాం కంపెనీలను డేటా లేని రీఛార్జ్ ప్లాన్‌లను అందించమని ఆదేశించింది. ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం రూ. 1849 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ చౌకైన ప్లాన్‌లో కస్టమర్లకు 365 రోజుల లాంగ్ టైమ్ వ్యాలిడిటీతో అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్ పొందవచ్చు.