×
Ad

Big Bachat Sale 2026 : ఇది కదా డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌పై రూ. 20వేలు తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!

Big Bachat Sale : ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌పై ఏకంగా రూ. 20వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆపిల్ లవర్స్ ఐఫోన్ ఎయిర్ డిస్కౌంట్ ధరకే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..

Big Bachat Sale

  • ఆపిల్ అత్యంత సన్నని ఐఫోన్ ఎయిర్ ధర భారీగా తగ్గింది
  • ఐఫోన్ ఎయిర్ కొనుగోలుపై రూ. 20వేలు డిస్కౌంట్
  • ఐఫోన్ ఎయిర్ ప్రారంభ ధర రూ. 1,19,900 నుంచి తగ్గింపు

Big Bachat Sale 2026 : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఇలాంటి డిస్కౌంట్ మళ్లీ దొరకదు. ఆపిల్ ఇటీవలే లాంచ్ చేసిన ఐఫోన్ ఎయిర్ ధర భారీగా తగ్గింది. ఈ హై-ఎండ్ ఐఫోన్ రూ. 25వేలు తగ్గింపుతో లభిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో లాంచ్ అయిన ఈ ఐఫోన్ ధర ఇప్పుడు ప్రారంభ ధర కన్నా తక్కువ ధరకే లభిస్తోంది.

ఈ ఐఫోన్ ఎయిన్ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ సేవింగ్స్ కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుత బిగ్ బచత్ సేల్ సమయంలో ఈ ఆపిల్ ఐఫోన్‌ అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ అద్భుతమైన డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐఫోన్ ఎయిర్ ధర భారీ తగ్గింపు :
ఐఫోన్ ఎయిర్ ఫస్ట్ టైమ్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ప్రారంభ ధర రూ. 1,19,900గా ఉంది. ఈ ఐఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 99,900 ధరకు అందుబాటులో ఉంది. రూ. 20వేల ధర తగ్గింపు పొందవచ్చు. అదనంగా, ఐఫోన్ కొనుగోలు చేస్తే రూ. 4వేలు బ్యాంక్ డిస్కౌంట్, రూ. 1,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ ఎయిర్‌ రూ. 25వేల వరకు తగ్గింపుతో కొనేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది.

Read Also : Realme P4 Power : భారీ 10,001mAh బ్యాటరీతో రియల్‌మి P4 పవర్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఫిదానే, మీ బడ్జెట్‌ ధరలోనే..!

ఐఫోన్ ఎయిర్ ఫీచర్లు :
ఆపిల్ అత్యంత సన్నని ఐఫోన్‌ ఎయిర్‌లో 6.5-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌ డీఆర్ డిస్‌ప్లేతో వస్తుంది. 3000 నిట్స్ టాప్ బ్రైట్‌నెస్, 120Hz హై రిఫ్రెష్ రేట్‌తో OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఐఫోన్ ఎయిర్‌లో eSIM-మాత్రమే ఫోన్. అలాగే, వైర్డు USB టైప్-సి ఛార్జింగ్‌ కూడా అందిస్తుంది.

ఈ ఐఫోన్ 80శాతం టైటానియం బాడీతో వస్తుంది. కేవలం 5.6mm సన్నగా ఉంటుంది. 3nm ప్రాసెసింగ్ టెక్నాలజీతో 6-కోర్ సీపీయూ, 6-కోర్ జీపీయూ, 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌ A19 ప్రో బయోనిక్ చిప్‌సెట్ పవర్ అందిస్తుంది. అడ్వాన్స్ ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్టు ఇస్తుంది. సెకండ్ జనరేషన్ డైనమిక్ కాషింగ్‌ కూడా ఉంది. ఏఐ N1 చిప్‌ అందించారు.

బ్యాక్ సైడ్ సెన్సార్-షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 48MP కెమెరాతో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 18MP సెంటర్ స్టేజ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఆపిల్ ఫోన్ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌తో రోజంతా వస్తుంది. 30 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 27 గంటల వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది. అయితే, కంపెనీ బ్యాటరీ స్పెసిఫికేషన్లు వెల్లడించలేదు.