iphone 16 : పది నిమిషాల్లో మీ చెంతకు ఐఫోన్ -16 సిరీస్ ఫోన్లు.. ఎలా అంటే..?

అందరూ ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు విక్రయాలు భారత్ లో ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఏఐ సాంకేతిక తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో శక్తివంతంగా..

iphone 16

Bigbasket Delivering iphone 16 Models: అందరూ ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు విక్రయాలు భారత్ లో ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఏఐ సాంకేతిక తరహాలో యాపిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో శక్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ, ముంబై యాపిల్ స్టోర్ల వద్ద కొనుగోలుదారులు బారులు తీరారు. ఈ ఫోన్లు దక్కించుకునేందుకు గురువారం రాత్రి నుంచే క్యూ లైన్లలోవేచి ఉన్నారు. కానీ, ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు దక్కించుకోవటానికి ఇంతలా క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేదని టాటా గ్రూప్ పేర్కొంది. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు కావాలనుకునే వినియోగదారులకు ఆర్డర్ చేసిన పది నిమిషాల్లోనే ఫోన్లు అందించేలా ఏర్పాట్లు చేసింది.

Also Read : ‘ఐఫోన్ 16’కు యమక్రేజ్.. యాపిల్ స్టోర్ల వద్ద ఉదయం నుంచి బారులుతీరిన జనం.. వీడియోలు వైరల్

టాటా గ్రూప్ కు చెందిన నిత్యావసరాలు సరఫరా యాప్ బిగ్ బాస్కెట్ నుంచి ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను నిమిషాల్లో డెలివరీ చేయనున్నారు. ఇందుకోసం ఎలక్ట్రానిక్ పరికరాల విక్రయ విభాగం క్రోమాతో కలిసి టాటా పనిచేస్తోంది. ఈ సేవలను శుక్రవారం ఉదయం 8గంటల నుంచే ప్రారంభమయ్యాయి. అయితే, ప్రస్తుతం ముంబయి, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబయిల్లో మాత్రమే ఈ సేవలు మొదలయ్యాయి. త్వరలో దేశంలోని మిగిలిన నగరాల్లోకి ఈ సేవలను అందుబాటులోకి తెచ్చేలా టాటా గ్రూప్ సిద్ధమవుతోంది.

Also Read : Lava Blaze 3 5G Launch : కొత్త ఫోన్ కొంటున్నారా? లావా బ్లేజ్ 3 5జీ ఫోన్ ఇదిగో.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు వినియోగదారులకు కేవలం కొద్ది నిమిషాల వ్యవధిలోనే అందించే విషయంపై బిగ్ బాస్కెట్ సీఈవో హరి మేనన్ మాట్లాడారు.. ఎలక్ట్రానిక్ విభాగంలో మా ప్రస్థానానికి ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మేము అత్యంత వేగంగా వస్తువులు డెలివరీ చేస్తామని తెలిపారు. ఇదిలాఉంటే.. హరి మేనన్ ఓ ట్వీట్ చేశారు. ఇవాళ ఉదయం 8గంటలకు మొదటి ఐఫోన్16 ఆర్డర్ బిగ్ బాస్కెట్ కు వచ్చింది. ఉదయం 8.07 నిమిషాలకు దానిని కస్టమర్ చేతికి అందించాం. కేవలం ఏడు నిమిషాల్లోనే ఐఫోన్ 16 ఫోన్ ఆర్డర్ చేసేశామని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే బ్లింకిట్ కూడా ఐఫోన్ 16 మెరుపు డెలివరీలపై దృష్టిపెట్టింది. ఐఫోన్ ఆర్డర్ పెట్టిన కేవలం 15 నిమిషాల్లోనే కస్టమర్లకు డెలివరీ చేస్తామని చెబుతోంది.