BSNL Recharge Plan : BSNL చీపెస్ట్ ప్లాన్.. రోజుకు 3GB డేటా, 365 రోజులు ఫుల్ మజా..!
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం రోజుకు 3GB డేటాతో అత్యంత చౌకైన ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ 365 రోజుల లాంగ్ వ్యాలిడిటీతో వస్తుంది. ఫుల్ బెనిఫిట్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
- Sreehari A
- Published on- June 8, 2026 / 06:28 PM IST
BSNL Prepaid Plan
- బీఎస్ఎన్ఎల్ కస్టమర్ల కోసం వార్షిక రీఛార్జ్ ప్లాన్
- రోజుకు 3GB డేటాతో 365 రోజులు ఎంజాయ్
- మొత్తం 1095GB డేటా, 100 ఫ్రీ SMS బెనిఫిట్స్
BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బిగ్ న్యూస్.. లక్షలాది యూజర్ల కోసం అన్‌లిమిటెడ్ కాలింగ్ డేటాతో సహా అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) యూజర్ బేస్ పెంచుకునే దిశగా సరికొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది.
ఇందులో భాగంగా ప్రైవేట్ టెలికం కంపెనీల ప్లాన్‌ల కన్నా ఎక్కువ (BSNL Recharge Plan) బెనిఫిట్స్ అందించే అనేక సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు మరో సరసమైన ప్లాన్ తీసుకొచ్చింది.
ఒకసారి రీఛార్జ్ చేశారంటే చాలు.. ఏడాది పొడవునా ప్రతిరోజూ 3GB డేటాను ఎంజాయ్ చేయొచ్చు. పూర్తి వార్షిక రీఛార్జ్ ప్లాన్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
3GB రోజువారీ డేటా ప్లాన్ :
బీఎస్ఎన్ఎల్ ఎక్స్ వేదికగా ఈ కొత్త ప్లాన్ ప్రకటించింది. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రూ. 2799 మాత్రమే. ప్లాన్ బెనిఫిట్స్ విషయానికొస్తే.. యూజర్లకు 365 రోజుల ఫుల్ వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్లాన్ ఫ్రీ నేషనల్ రోమింగ్‌తో పాటు దేశంలోని ఎక్కడికైనా అన్‌లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు.
Read Also : Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం.. అసలేం జరిగిందంటే?
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ కింద ప్రతిరోజూ 3GB హై-స్పీడ్ డేటా పొందవచ్చు. యూజర్లు మొత్తం 1095GB డేటా అందుతుంది. అదనంగా, ప్రతిరోజూ 100 ఫ్రీ SMS బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ తీసుకుంటే నెలవారీగా రీఛార్జ్ చేయాల్సిన పని ఉండదు.
రూ. 51కే రీఛార్జ్ ఆఫర్ :
బీఎస్ఎన్ఎల్ ఇటీవలే రూ. 51కే సింగిల్ కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ సరసమైన ప్లాన్ యూజర్లకు దేశంలో ఎక్కడికైనా అన్ లిమిటెడ్ కాలింగ్‌ను అందిస్తుంది. ఫ్రీ నేషనల్ రోమింగ్ బెనిఫిట్ కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో బీఎస్ఎన్ఎల్ ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటా, 100 ఫ్రీ ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మొత్తం 56GB డేటా వాడుకోవచ్చు. అయితే, ఈ లిమిటెడ్ ఆఫర్ జూన్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈలోగా రీఛార్జ్ చేసుకుంటే ఫుల్ బెనిఫిట్స్ పొందవచ్చు.
