Zoom Lecture: ప్రతి జూమ్ లెక్చరర్ అటెండ్ అయిందని పిల్లికి కంగ్రాట్స్ చెప్పిన యూనివర్సిటీ

యూఎస్ కాలేజీలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో టోపీని ధరించి ఉన్న వేలాది మంది విద్యార్థులు, పెద్దలతో పాటు మరొక విద్యార్థి విచిత్రంగా కనిపించారు. మీడియా వివరాల ప్రకారం.. ఫ్రాన్సిస్కా బోర్డియర్ ఇటీవలే ఆస్టిన్‌లోని టెక్సాస్ యూనివర్సీటీ నుంచి పట్టభద్రుడయ్యారు.

Zoom Lecture: ప్రతి జూమ్ లెక్చరర్ అటెండ్ అయిందని పిల్లికి కంగ్రాట్స్ చెప్పిన యూనివర్సిటీ

Graduation

Updated On : June 6, 2022 / 3:14 PM IST

Zoom Lecture: యూఎస్ కాలేజీలో జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకలో టోపీని ధరించి ఉన్న వేలాది మంది విద్యార్థులు, పెద్దలతో పాటు మరొక విద్యార్థి విచిత్రంగా కనిపించారు. మీడియా వివరాల ప్రకారం.. ఫ్రాన్సిస్కా బోర్డియర్ ఇటీవలే ఆస్టిన్‌లోని టెక్సాస్ యూనివర్సీటీ నుంచి పట్టభద్రుడయ్యారు. ఈ మైలురాయిని ఆమె ఒంటరిగా సాధించలేదు. సుకీ అనే పెంపుడు పిల్లి కూడా యజమానితో కలిసి ప్రతి ఆన్‌లైన్ తరగతులకు హాజరైంది.

సోషల్ మీడియా వేదికగా బోర్డియర్ మనస్సు కదిలించే ఫొటోలను పంచుకుంది. తనతో పాటు పెంపుడు జీవి అయిన పిల్లికి గ్రాడ్యుయేషన్ దుస్తులు వేసి పోస్టు పెట్టింది. “నా పిల్లి ప్రతి జూమ్ లెక్చర్‌కు నాతో పాటు అటెండ్ అయింది. ఆస్టిన్‌లోని ద యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో మేమిద్దరం కలిసి గ్రాడ్యుయేషన్ సాధించాం” అని పేర్కొన్నారు.

ఇది చాలా ప్రత్యేకమైన గ్రాడ్యుయేషన్ అని మీడియాలో పోస్టు పెట్టింది బోర్డియర్. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అయింది. పలువురు నెటిజన్లు సుకీ రీసెంట్ అచీవ్‌మెంట్ అంటూ అద్భుతమైన గ్రాడ్యుయేషన్ పొందావంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.

Read Also: మళ్లీ “జూమ్ కాల్” ద్వారా 3వేల మంది ఉద్యోగులను తీసేసిండు

ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి.. దాదాపు సరిగ్గా సరిపోయే టోపీ, గౌను కొనుగోలు చేయగలిగానని వెల్లడించింది. తన పిల్లిని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ స్ప్రింగ్ 2022 గ్రాడ్యుయేటింగ్ క్లాస్‌లో గౌరవ సభ్యురాలిగా చేయాలనుకుంటున్నట్లు చెప్పింది. ఏదేమైనప్పటికీ, సుకీ ఎటువంటి గ్రాడ్యుయేటింగ్ డిగ్రీని అందుకోనప్పటికీ ఆ పిల్లి అరుదైన సత్కారం అందుకుందన్న మాట.