CES 2023 _ Samsung introduces new range of Neo QLED Smart TVs, OLED Smart TVs, more
CES 2023 : CES 2023 ఈవెంట్ అతి త్వరలో జరగనుంది. ఈవెంట్ ప్రారంభానికి ముందే.. ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) కొత్త రేంజ్ Neo QLED TVs, OLED TVs, MicroLED TVలను ప్రవేశపెట్టింది. శాంసంగ్ నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ లైనప్ మల్టీ ఇంటిగ్రేటెడ్ డివైజ్ ఆప్షన్లతో యూజర్లను మరింత ఆకట్టుకునేలా ఉన్నాయి. శాంసంగ్ యూజర్లు మరిన్ని వ్యూ ఆప్షన్లతో మెరుగైన ఫొటో క్వాలిటీని అందించేలా ఉన్నాయి.
కంపెనీ ప్రకారం.. కొత్త Neo QLED మోడల్‌లు 4K, 8K రిజల్యూషన్‌లలో వస్తాయి. క్వాంటమ్ MiniLED-లైట్ ప్యానెల్‌లను ఉపయోగిస్తుంది. 2023లో శాంసంగ్ మైక్రో LED లైనప్ 50 నుంచి 140 అంగుళాల వరకు స్క్రీన్ సైజులను కలిగి ఉంటుంది. OLED TV లైనప్ 144Hz రిఫ్రెష్ రేట్, శాంసంగ్ గేమింగ్ హబ్‌ను కలిగి ఉంది. OLED టీవీలతో పాటు గేమింగ్ కోసం AMD ఫ్రీసింక్ ప్రీమియం ప్రో సర్టిఫికేషన్‌ను కూడా అందిస్తోంది.
శాంసంగ్ నియో QLED టీవీలు, ఫీచర్లు ఇవే :
శాంసంగ్ Neo QLED టీవీలు 8K, 4K వేరియంట్‌లలో వస్తాయి. ఈ డివైజ్ ఫొటో క్వాలిటీ 14-బిట్ ప్రాసెసింగ్, AI అప్‌స్కేలింగ్‌తో క్వాంటమ్ మినీ LED-లైట్ టీవీకి సపోర్టు ఇచ్చే న్యూరల్ క్వాంటం ప్రాసెసర్ ద్వారా సపోర్టు అందిస్తుంది. కొత్త ఆటో HDR రీమాస్టరింగ్ అల్గారిథమ్‌ను కూడా కలిగి ఉంది. డిస్‌ప్లే ఆధారంగా స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ కంటెంట్‌పై రియల్ టైమ్ HDR ఎఫెక్ట్‌లను AI డీప్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.
CES 2023 _ Samsung introduces new range of Neo QLED Smart TV
శాంసంగ్ MicroLED, OLED టీవీ ఫీచర్లు :
కంపెనీ స్మార్ట్‌టీవీలను అందించే శాంసంగ్ 50, 63, 76, 89, 101, 114, 140-అంగుళాల డిస్‌ప్లే సైజులతో మైక్రోఎల్‌ఈడీ టీవీలను ప్రవేశపెట్టింది. బేజెల్-లెస్ డిజైన్‌ను కలిగి ఉంది. కంపెనీ 2023 OLED లైనప్ మెరుగైన కలర్లతో వచ్చింది. కలర్ క్వాంటం డాట్ టెక్నాలజీతో పాటు న్యూరల్ క్వాంటమ్ ప్రాసెసర్‌లతో వస్తుంది. స్మార్ట్‌టీవీ రేంజ్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Samsung గేమింగ్ హబ్‌తో సహా Samsung స్మార్ట్ ఫీచర్‌లకు సపోర్టు ఇస్తుంది. OLED TV రేంజ్ మెరుగైన గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం AMD FreeSyn ప్రీమియం ప్రో సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉంది.
CES 2023 _ Samsung introduces new range of Neo QLED Smart TVs, OLED
మరోవైపు.. భారత మార్కెట్లో శాంసంగ్ Samsung Galaxy F04 ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఆక్టా-కోర్ MediaTek Helio P35 SoC ద్వారా పవర్ అందిస్తుంది. శాంసంగ్ నుంచి వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. Samsung Galaxy F04, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రూ. 9,499 ధరతో వచ్చింది. శాంసంగ్ యూజర్లు ఒపల్ గ్రీన్, జేడ్ పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు. జనవరి 12, 2023 నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..