Oppo F31 Launch : ఒప్పో F31 సిరీస్ లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. ధర, స్పెషిఫికేషన్లపై భారీ అంచనాలివే..!

Oppo F31 Launch : ఒప్పో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. ఒప్పో F31 లాంచ్ డేట్ ఎప్పుడో తెలిసింది.. పూర్తి వివరాలివే..

Oppo F31 Launch : ఒప్పో F31 సిరీస్ లాంచ్ ఎప్పుడో తెలిసిందోచ్.. ధర, స్పెషిఫికేషన్లపై భారీ అంచనాలివే..!

Oppo F31 Launch

Updated On : August 23, 2025 / 11:43 AM IST

Oppo F31 Launch : ఒప్పో నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. ఒప్పో F-సిరీస్ స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియో విస్తరించనుంది. కొత్త ఒప్పో F31 సిరీస్‌ లాంచ్ (Oppo F31 Launch) చేయనున్నట్టు సమాచారం. ఈ హ్యాండ్‌సెట్‌లో ఒప్పో F31, హై-ఎండ్ ఒప్పో F31 ప్రో ఉంటాయి.

టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ ప్రకారం.. రాబోయే సిరీస్ భారీ బ్యాటరీ అప్‌గ్రేడ్‌ కలిగి ఉండనుంది. అయితే, కెమెరా లేదా చిప్‌సెట్ అప్‌గ్రేడ్ ఉండకపోవచ్చు. ఒప్పో F31, ఒప్పో F31 ప్రో వరుసగా ఒప్పో F29, ఒప్పో F29 ప్రో తర్వాత రానున్నాయి. ఒప్పో F31 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్, ధర, స్పెసిఫికేషన్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఒప్పో F31, ఒప్పో F31 ప్రో లాంచ్ టైమ్‌లైన్ :
ఒప్పో F31, F31 ప్రో సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అయితే, కచ్చితమైన లాంచ్ వివరాలు ఇంకా ప్రకటించలేదు.

Read Also : WhatsApp Voicemail : వాట్సాప్‌లో కిర్రాక్ ఫీచర్లు.. వాయిస్‌మెయిల్, మిస్డ్ కాల్ రిమైండర్.. మీరు కాల్ మిస్ అయితే వాయిస్ మెసేజ్ వస్తుంది!

ఒప్పో F31, F31 ప్రో స్పెసిఫికేషన్లు :

పర్ఫార్మెన్స్ పరంగా ఒప్పో F31 ప్రో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో రానుంది. ఒప్పో F31 సిరీస్ 360-డిగ్రీల ఆర్మర్ బాడీని కలిగి ఉంటుందని అంచనా. ముందున్న ఒప్పో F29 సిరీస్ మాదిరిగానే ఉంటుంది. ప్రొటెక్షన్ కోసం ఈ హ్యాండ్‌సెట్‌లలో అల్యూమినియం అల్లాయ్ మదర్‌బోర్డ్ కవర్, రీన్‌ఫోర్స్డ్ డైమండ్-కట్ కార్నర్‌, ఇంపాక్ట్-అబ్జార్బింగ్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉండవచ్చు.

ఒప్పో F31 సిరీస్ ఒప్పో హంటర్ యాంటెన్నా లేఅవుట్‌తో నెట్‌వర్క్ అందిస్తుందని భావిస్తున్నారు. సిగ్నల్ రిసెప్షన్‌ 300 శాతం వరకు పెంచుతుందని అంచనా. నాలుగు-ఛానల్ రిసెప్షన్ సిస్టమ్ ఆటోమాటిక్‌గా నెట్‌వర్క్‌కు మారుతుంది.

కాల్ డ్రాప్స్ లేదా కనెక్టివిటీ అవకాశాలను తగ్గిస్తుంది. ఒప్పో F31 సిరీస్, ఒప్పో F29 లైనప్ కన్నా కొత్త రీడిజైన్‌గా కనిపిస్తోంది. మెయిన్ హార్డ్‌వేర్ ఓవర్‌హాల్స్ కన్నా ప్రధానంగా బ్యాటరీ సామర్థ్యం, అధికారిక లాంచ్ వివరాలు ఇంకా రివీల్ చేయలేదు.