WhatsApp Voicemail : వాట్సాప్‌లో కిర్రాక్ ఫీచర్లు.. వాయిస్‌మెయిల్, మిస్డ్ కాల్ రిమైండర్.. మీరు కాల్ మిస్ అయితే వాయిస్ మెసేజ్ వస్తుంది!
WhatsApp Voicemail : వాట్సాప్‌లో అతి త్వరలో కొత్త ఫీచర్లు రిలీజ్ కానున్నాయి. వాయిస్ మెయిల్, మిస్డ్ కాల్ రిమైండర్ ఫీచర్ కూడా రానుంది.

WhatsApp Voicemail
WhatsApp Voicemail : వాట్సాప్ యూజర్ల కోసం అద్భుతమైన ఫీచర్లు రాబోతున్నాయి. మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లో కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా (WhatsApp Voicemail) మార్చేందుకు వాట్సాప్ సరికొత్త ఫీచర్లపై పనిచేస్తోంది.
ఇటీవలే కాల్ షెడ్యూలింగ్ ఫీచర్ రిలీజ్ చేసిన మెసేజింగ్ దిగ్గజం ఇప్పుడు కొత్త మిస్డ్ కాల్ రిమైండర్‌లతో పాటు వాయిస్‌మెయిల్-స్టయిల్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. వాట్సాప్ పాపులర్ ట్రాకర్ (WABetaInfo) రిపోర్టు ప్రకారం.. వాయిస్‌మెయిల్ ఫీచర్ యాప్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్‌లోకి అందుబాటులోకి వచ్చింది.
ఈ 3 ఆప్షన్లు ఇవే .. :
ఈ ఫీచర్ వినియోగదారులను తమ కాల్‌కు సమాధానం ఇవ్వకపోతే క్విక్ వాయిస్ మెసేజ్ పంపేందుకు వీలు కల్పిస్తుంది. సాధారణ మొబైల్ నెట్‌వర్క్‌లలోని ట్రెడేషనల్ వాయిస్‌మెయిల్ ఆప్షన్ మాదిరిగానే పనిచేస్తుంది. ప్రస్తుత బీటాలో ఈ ఫీచర్ వర్క్ అవుతుంది.
వాయిస్ కాల్ ఆన్సర్ చేయకపోతే కాలర్ స్క్రీన్ దిగువన (Cancel, Again Call, Record Voice Message) అనే 3 ఆప్షన్లు కనిపిస్తాయి. యూజర్లు తమ వాయిస్ మెసేజ్ రికార్డ్ చేయాలని ఎంచుకుంటే అది రిసీవర్‌కు వెంటనే పంపుతుంది. అప్పుడు రిసీవర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాయిస్ మెసేజ్ వినవచ్చు.
WhatsApp Voicemail : ఐఓఎస్ బీటా టెస్టర్లకు వస్తుందా? :
వాట్సాప్‌లో ఇప్పటికే చాట్‌లలో సపరేట్ వాయిస్ మెసేజ్ పంపుకోవచ్చు. కానీ, ఈ కొత్త వాయిస్‌మెయిల్ ఆప్షన్ మరింత సులభంగా ఉంటుంది. మెసేజ్ మిస్డ్ కాల్‌తో నేరుగా లింక్ అవుతుంది. రిసీవర్ కాల్ ఎందుకు చేశాడు అనేది ఈజీగా తెలుసుకోవచ్చు.
కాల్ లోపల మెసేజ్ డ్రాప్ చేసే వాయిస్‌మెయిల్ సిస్టమ్ మాదిరిగా కాకుండా వాట్సాప్ కాలర్ తర్వాత రికార్డ్ చేసేందుకు వీలుంటుంది. ప్రస్తుతం, ఈ వాయిస్‌మెయిల్ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? iOS బీటా టెస్టర్లకు కూడా వస్తుందా? అనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు.
మిస్డ్ కాల్ రిమైండర్ ఫీచర్ :
వాయిస్‌మెయిల్ ఒక్కటే కాదు.. వాట్సాప్ మిస్డ్ కాల్ రిమైండర్ ఫీచర్ కూడా తీసుకురానుంది. ఈ టూల్ యూజర్లు మిస్డ్ కాల్ ఎంచుకుని యాప్‌లో రిమైండర్ నోటిఫికేషన్‌ను సెట్ చేయొచ్చు. వాట్సాప్ ఎంచుకున్న సమయంలో వారిని అలర్ట్ చేస్తుంది. అంటే మళ్లీ కాల్ చేయడం మర్చిపోకుండా అలర్ట్ చేస్తుంది.
చాట్ మెసేజ్ కోసం ఇలాంటి రిమైండర్ ఫీచర్ ఇప్పటికే ఉంది. ఇప్పుడు వాట్సా్ప్ కాల్‌లకు కూడా విస్తరించనుంది. వాట్సాప్ ఇప్పటికే అందించే కాల్ షెడ్యూలింగ్ ఫీచర్‌తో యూజర్లు Google Meet లేదా Microsoft Teamsలో మాదిరిగా మీటింగ్స్, కాల్స్ ప్లాన్ చేసుకోవచ్చు. వాయిస్‌మెయిల్, రిమైండర్ ఆప్షన్లతో వాట్సాప్ వ్యక్తిగత, ఆఫీసు విషయాలకు ప్రయోజనకరంగా ఉంటాయి.