SBI Credit Card Rule : SBI క్రెడిట్ కార్డు హోల్డర్లకు బిగ్ అలర్ట్.. ఇక నుంచి ఈ పేమెంట్లపై రివార్డు పాయింట్లు రావు.. లిస్ట్ చెక్ చేసుకోండి..
SBI Credit Card Rule : ఎస్బీఐ క్రెడిట్ కార్డు యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఇకపై ఇలాంటి పేమెంట్లపై ఎలాంటి రివార్డు పాయింట్లన పొందలేరు..

SBI Credit Card Rule
SBI Credit Card Rule : ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో ఎస్బీఐ క్రెడిట్ కార్డు రూల్స్ మారబోతున్నాయి. ఎస్బీఐ కార్డ్ క్రెడిట్ కార్డ్ రివార్డ్స్ ప్రోగ్రామ్‌ను (SBI Credit Card Rule) సెప్టెంబర్ 1, 2025 నుంచి సవరించనుంది. ఈ కొత్త సవరణ తర్వాత ఎంపిక చేసిన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌ల కస్టమర్లు డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు/మర్చంట్స్, ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై చేసే ఖర్చులపై రివార్డ్ పాయింట్లను పొందలేరు.
ఎస్బీఐ కార్డ్ వెబ్‌సైట్ ప్రకారం.. “సెప్టెంబర్ 1, 2025 నుంచి లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ SBI కార్డ్ , లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ SBI కార్డ్ SELECT, లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ SBI కార్డ్ ప్రైమ్ డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు/వ్యాపారులు, ప్రభుత్వ సంబంధిత లావాదేవీలపై చేసే ఖర్చులపై రివార్డ్ పాయింట్ల సేకరణ నిలిచిపోతుంది.” అని పేర్కొంది.
మార్పులు అమల్లోకి వచ్చాక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఆన్‌లైన్ గేమింగ్ క్రెడిట్‌లను కొనుగోలు లేదా ప్రభుత్వ పోర్టల్‌లలో పేమెంట్లు చేయడం ద్వారా ఎలాంటి రివార్డ్ పాయింట్లను పొందలేరు. ఎస్బీఐ కార్డ్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్లను నిలిపివేయడం ఇదే మొదటిసారి కాదు. డిసెంబర్ 2024లో కూడా ఇలాంటి మార్పులు చేసింది.
SBI Credit Card Rule : ఏయే కార్డులపై ఎఫెక్ట్? :
లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ SBI కార్డ్, లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ SBI కార్డ్ SELECT, లైఫ్‌స్టైల్ హోమ్ సెంటర్ SBI కార్డ్ PRIME కార్డులు ఎఫెక్ట్ అవుతాయి. డిసెంబర్ 2024లో కొన్ని క్రెడిట్ కార్డులకు డిజిటల్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు/మర్చంట్స్ రివార్డ్ పాయింట్లను పొందలేరు.
HDFC క్రెడిట్ కార్డ్‌లో ఇదే రూల్స్ :
ఎస్బీఐ కార్డ్ కన్నా ముందు HDFC బ్యాంక్ కూడా జూన్‌లో ఇలాంటి మార్పులను ప్రకటించింది. జూలై 1, 2025 నుంచి ఏదైనా HDFC క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే ఆన్‌లైన్ స్కిల్స్ ఆధారిత గేమింగ్ లావాదేవీలు రివార్డ్ పాయింట్లకు అర్హత పొందవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది.
ఎస్బీఐ కార్డ్ వెబ్‌సైట్ ప్రకారం.. ఎస్బీఐ రివార్డ్ పాయింట్లపై ముఖ్యమైన వివరాలివే :
రివార్డ్ పాయింట్ రిడంప్షన్‌తో ఛార్జీలు ఉన్నాయా? :
రిడంప్షన్ కోసం ఎస్బీఐ కార్డ్ అకౌంట్ నుంచి రూ. 99, పన్నుల రివార్డ్ రిడంప్షన్ రుసుము డెబిట్ అవుతుంది. రిడంప్షన్, స్టేట్‌మెంట్ క్రెడిట్ విషయంలో ఈ మొత్తం డెలివరీ, ప్రాసెసింగ్ ఛార్జీలపై వర్తిస్తుంది.
Read Also : TikTok Comeback : భారత్‌కు టిక్‌టాక్ మళ్లీ వస్తుందా? బ్యాన్ అలానే ఉందా? ఏది నిజం? ఫుల్ డిటెయిల్స్..!
ఆన్‌లైన్ రివార్డ్ రిడంప్షన్ కోసం మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలా? :
అవసరం లేదు. మళ్ళీ రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. లాగిన్ కోసం మీ ఎస్బీఐ కార్డ్ ఆన్‌లైన్ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఉంటే చాలు.
డెలివరీ వస్తువులపై రివార్డ్ పాయింట్లు రిడీమ్ చేయవచ్చా? :
రివార్డ్ పాయింట్ల స్కీమ్ కింద రిడీమ్ చేసిన వస్తువులు రికార్డులలో పేర్కొన్న విధంగా కార్డ్ ప్రైమరీ యజమాని అడ్రస్‌కు మాత్రమే డెలివరీ అవుతాయి.
రివార్డ్ పాయింట్లతో ఎస్బీఐ కార్డ్ ఔట్ స్టాండింగ్ అమౌంట్ చెల్లించవచ్చా? :
చెల్లించవచ్చు. మీ రివార్డ్ పాయింట్ల ద్వారా మీ ఔట్ స్టాండింగ్ అమౌంట్ సెటిల్ చేయవచ్చు. మీ రివార్డ్ పాయింట్లను 2వేలకు పైగా ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించుకోవచ్చు.
సింగిల్ కార్డ్ అకౌంట్ నుంచి మరో కార్డ్ అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చా?
చేయలేరు. మీ రివార్డ్ పాయింట్లను ఒక ఎస్బీఐ కార్డ్ నుంచి మరో SBI కార్డ్‌కు ట్రాన్స్‌ఫర్ చేయలేరు. రివార్డ్ పాయింట్లను సంబంధిత ఎస్బీఐ కార్డ్‌లో మాత్రమే రీడీమ్ చేసుకోవచ్చు.