ఈ స్మార్ట్‌ఫోన్‌లో 9 కెమెరాలు

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్‌తో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన నోకియా మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌తో ముందుకోస్తోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఏడు కెమెరాలతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లలోకి ప్రవేశపెట్టనుంది. అదే నోకియా 9 ప్యూర్ వ్యూ. ప్రపంచంలోనే ఏడు కెమెరాలతో ఇదే తొలి స్మార్ట్‌ఫోన్ కావడం విశేషం. కానీ, ఈ స్మార్ట్ ఫోన్ విడుదల చేయడానికి ముందే దీని ఫీచర్లకు సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. ఆ వీడియోలో నోకియా ప్యూర్ వ్యూ ఫోన్ ప్రత్యేక ఫీచర్లు యూజర్లను ఎట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా నోకియా 9 ప్యూర్ వ్యూలో ఫ్రంట్ 7 కెమెరాలు, బ్యాక్ 2 కెమెరాలు మరింత ఆకర్షించనున్నాయి. హెచ్ఎండీ మొబైల్ సంస్థ అందించే ఈ సరికొత్త ఫోన్ మోడల్‌ను మొత్తం 9 కెమెరాలతో రూపొందించింది. ఇందులోని కెమెరా సెన్సార్లు సాధారణ లైట్ క్వాలిటీ కెమెరా సెన్సార్ కంటే 10 రెట్లు ఎక్కువగా ప్రభావంతంగా పనిచేస్తాయి. సెన్సార్ ఉండటం వల్ల హెచ్‌డీ క్వాలిటీతో కూడిన ఫొటోలు తీసే వీలుంది. నోకియా మోడల్స్‌లో రానున్న ఈ మెడ్రాన్ మొబైల్ ప్రపంచంలోనే తొలి డివైస్‌గా నిలవనుంది. ప్యూర్ డిస్ ప్లే ప్యానెల్‌తో తీసుకొస్తున్నఈ డివైస్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే..
నోకియా 9 ప్యూర్ వ్యూ:
5.9 అంగుళాల డిస్‌ప్లే
క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 845 సాక్
6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్
8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్
ఫింగర్ ప్రింట్ డిస్‌ప్లే.