Coolpad Cool 80 : బడ్జెట్ ధరలో 5జీ కిల్లర్ ఫోన్.. కొత్త కూల్‌ప్యాడ్ కూల్ 80 ఫోన్ అదుర్స్.. ధర జస్ట్ ఎంతంటే?

Coolpad Cool 80 Launch : కూల్‌ప్యాడ్ చైనాలో కూల్ 80 కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో 90Hz డిస్‌ప్లే, హీలియో G99 ప్రాసెసర్, 128GB స్టోరేజ్ ఐఫోన్‌ను పోలిన డిజైన్ ఉన్నాయి.

Coolpad Cool 80 Specifications

  • కూల్‌ప్యాడ్ కూల్ 80లో ర్యామ్, 128GB స్టోరేజ్
  • ఐఫోన్‌ను మాదిరిగానే ఫోన్ బ్యాక్ సైడ్ డిజైన్ ఉండొచ్చు
  • ప్రస్తుతం కూల్‌ప్యాడ్ చైనా మార్కెట్‌లో లాంచ్

Coolpad Cool 80 Launch : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? కూల్‌ప్యాడ్ నుంచి సరికొత్త ఫోన్ వచ్చేసింది. కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘కూల్ 80’ని చైనా మార్కెట్లో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో రిలీజ్ అయింది.

ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్, 128GB స్టోరేజ్ (Coolpad Cool 80 Launch) ఉన్నాయి. డిజైన్ పరంగా పరిశీలిస్తే.. కూల్ ప్యాడ్ కూల్ 80 ఫోన్ రియర్ ప్యానెల్ ఐఫోన్ మాదిరిగా ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే, కెమెరా మాడ్యూల్ లేఅవుట్ కొద్దిగా భిన్నంగా ఉంటుంది.

కూల్‌ప్యాడ్ కూల్ 80 ఫోన్ సింగిల్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర 819 యువాన్లు (సుమారుగా రూ. 11,500)కు లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రాక్ సాండ్ బ్లాక్, డ్యూన్ ఆరెంజ్ గాజ్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ప్రస్తుతం చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉంది. కంపెనీ ఇంకా గ్లోబల్ లాంచ్ ఇంకా ప్రకటించలేదు.

కూల్‌ప్యాడ్ కూల్ 80 స్పెషిఫికేషన్లు :
కూల్‌ప్యాడ్ కూల్ 80లో HD+ రిజల్యూషన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే పంచ్-హోల్ డిజైన్‌తో వస్తుంది. పర్ఫార్మెన్స్ కోసం మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

ఈ ఫోన్‌లో 6GB ఫిజికల్ ర్యామ్ ఉంది. 8GB వరకు వర్చువల్ ర్యామ్ విస్తరణకు సపోర్టు ఇస్తుంది. కూల్‌ప్యాడ్ ఫోన్ స్టోరేజ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. తద్వారా మైక్రో SD కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫొటోగ్రఫీ కోసం 13MP రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. నివేదికలను పరిశీలిస్తే.. ఈ ఫోన్ కెమెరా డిజైన్ ఐఫోన్‌ మాదిరిగా ఉన్నప్పటికీ కెమెరా సెటప్ కొంచెం భిన్నంగా ఉండొచ్చు.

ఫోన్ బ్యాటరీ కెపాసిటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నివేదికల ప్రకారం.. కూల్‌ప్యాడ్ కూల్ 80 ఫోన్ (JD.com)లో లిస్టులో కనిపించింది. 4,000mAh బ్యాటరీ, 10W ఛార్జింగ్ అందిస్తుందని సమాచారం. అయితే, ఫోన్ సైజు, ప్రస్తుత మార్కెట్ ప్రకారం చాలా తక్కువగా అనిపిస్తుంది. అందుకే బ్యాటరీ, ఛార్జింగ్ వివరాలపై అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.