JioBharat V4 4G : పండగ చేస్కోండి.. జస్ట్ రూ. 799కే జియో 4G ఫోన్.. ఫొటోలే కాదు.. UPI పేమెంట్లు చేయొచ్చు..!
JioBharat V4 4G : రిలయన్స్ జియో కంపెనీ నుంచి జియోభారత్ V4 4G అనే కొత్త సరసమైన 4G ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. యూపీఐ పేమెంట్లు, ఫొటోలకు అద్భుతంగా ఉంటుంది. ధర కూడా చాలా చీప్..
JioBharat V4 4G
- జియోభారత్ V4 4జీ ఫోన్ 1.7-అంగుళాల TFT డిస్ప్లే
- 0.3MP ప్రైమరీ కెమెరా, 1000mAh లి-అయాన్ బ్యాటరీ
- 1.7-అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే, 0.3MP ప్రైమరీ కెమెరా
JioBharat V4 4G : జియో యూజర్లకు పండగే పండగ.. రిలయన్స్ జియో అత్యంత సరసమైన 4జీ ఫీచర్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ 4జీ ఫీచర్ ఫోన్ ప్రత్యేకంగా లో బడ్జెట్ యూజర్ల కోసమే తీసుకొచ్చింది. 4Gకి అప్‌గ్రేడ్ అయ్యే యూజర్లు ఈ జియోఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్లో 1.7-అంగుళాల డిస్ప్లే, 1000mAh బ్యాటరీ ఉన్నాయి. జియోభారత్ V4 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధరకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
జియోభారత్ V4 4జీ ధర ఎంతంటే? :
ధర విషయానికి వస్తే.. జియోభారత్ V4 4జీ ఫోన్ ధర రూ. 799కే లభిస్తోంది. ఈ ఫీచర్ ఫోన్ ఇప్పుడు జియోమార్ట్, జియో అధికారిక వెబ్సైట్, రిలయన్స్ జియో అధికారిక రిటైల్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్ ద్వారా కొనేసుకోవచ్చు. ఈ జియో ఫోన్ రిటైల్ స్టోర్లలో బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫొటోలు మాత్రమే కాదు.. యూపీఐ పేమెంట్లు కూడా చేయొచ్చు.
Read Also : Vivo T5 Lite 5G : వావ్.. కొత్త వివో 5G ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు ఉన్నాయి భయ్యా, మైండ్ బ్లోయింగ్ అంతే..!
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు :
జియోభారత్ V4 4జీ ఫోన్ 1.7-అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లేతో వస్తుంది. ఇందులో 0.3MP ప్రైమరీ కెమెరా ఉంది. యూనిసోక్ చిప్సెట్తో రన్ అవుతుంది. ఇందులో 1000mAh లి-అయాన్ బ్యాటరీ ఉంది. స్టోరేజ్‌ను 128GB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్లో జియోకంపానియన్, జియోటీవీ, జియోహాట్‌స్టార్, జియోపే, జియోసావన్, జియోఫోటోస్ వంటి యాప్‌లు ప్రీ ఇన్స్టాల్ అయి ఉంటాయి.
జియోభారత్ ఫోన్ కీప్యాడ్ ఎక్స్పీరియన్స్ 2జీ నుంచి 4జీకి అప్‌గ్రేడ్ ఆప్షన్ అందిస్తుంది. జియో 4జీ నెట్‌వర్క్‌పై వీడియో స్ట్రీమింగ్, సినిమాలు, స్పోర్ట్స్ హైలైట్స్ వంటి ఎంటర్ టైన్మెంట్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్లో ఎఫ్ఎమ్ రేడియో, 4జీ బ్యాండ్లు, లౌడ్ స్పీకర్ కూడా ఉన్నాయి. సింగిల్ నానో సిమ్‌కు సపోర్టు ఇస్తుంది.
