Diwali 2026 Sale : దీపావళి ఆఫర్లే ఆఫర్లు.. రూ. 50వేల లోపు 5 బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే.. మీ ఫేవరెట్ ఫోన్ ఇదేనా?
Diwali 2026 Sale : ఈ దీపావళికి రూ. 50వేల లోపు మంచి కెమెరా ఫోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? డబ్బులు ఆదాతో పాటు కెమెరాలు, పండుగ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో కొనేసుకోవచ్చు..
- Sreehari A
- Published on- October 28, 2026 / 11:06 AM IST
Diwali 2026 Sale : 5 Best Camera Phones
- రూ. 50వేల లోపు ధరలో మంచి కెమెరా ఫోన్లు
- అమెజాన్ దీపావళి 2026 సేల్ ఆఫర్లు, బ్యాంకు డిస్కౌంట్లు
- 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ 50MP టెలిఫోటో షూటర్
Diwali 2026 Sale : దీపాల పండుగ సమీపిస్తోంది.. భారత మార్కెట్లో పలు ప్లాట్‌ఫామ్‌లలో దీపావళి సేల్ జోరుగా నడుస్తోంది. ఈ పండుగ సీజన్‌లో మీరు రూ. 50వేల లోపు కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే.. అమెజాన్ స్మార్ట్‌ఫోన్ల జాబితాలో అదిరిపోయే ఫోన్లు ఉన్నాయి.. పండుగ డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్‌తో లభించే ఈ 5 స్మార్ట్‌ఫోన్‌లపై ఓసారి లుక్కేయండి..
రెడ్‌మి నోట్ 17 ప్రో మాక్స్ 5జీ :
రెడ్‌మి నోట్ 17 ప్రో మ్యాక్స్ 5జీ ఫోన్ (8GB + 256GB) ప్రస్తుతం రూ. 49,998 ధరకు లభిస్తోంది. మీరు HDFC బ్యాంక్, SBI, యాక్సిస్ బ్యాంక్ అనేక ఇతర ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లతో ఈఎంఐపై రూ. 4,074.07 వరకు తగ్గింపు పొందవచ్చు.
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6వ జనరేషన్ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. భారీ 10,000mAh బ్యాటరీతో పాటు బ్యాక్ సైడ్ 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ షూటర్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 32MP లెన్స్ అందిస్తుంది.
నథింగ్ ఫోన్ (4a) ప్రో :
నథింగ్ ఫోన్ (4a) ప్రో (8GB + 128GB) ధర రూ. 45,699కు లభిస్తుంది. ఈ డివైస్‌పై రూ. 37,600 వరకు వాల్యూతో ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫోటో లెన్స్ 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 32MP లెన్స్‌తో వస్తుంది.
ఒప్పో రెనో16సి 5జి
ఒప్పో రెనో16సి 5జి (8జిబి + 128జిబి) ధర రూ. 52,999కు లభిస్తుంది. అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ఈఎంఐ నాన్-ఈఎంఐలపై ధర రూ. 5,300 వరకు తగ్గించుకోవచ్చు. అంతేకాదు.. దీనిపై రూ. 45,100 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఈ ఒప్పో ఫోన్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ అందిస్తుంది. ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ 50MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఇందులో 50MP సెన్సార్ కూడా ఉంది.
వివో వి70 ఎఫ్ఈ 5జీ :
వివో వి70 ఎఫ్ఈ 5జీ (8GB + 256GB) ధర రూ. 43,760కు లభిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7360-టర్బో ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 200MP ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ షూటర్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 50MP లెన్స్ కూడా ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ 6 :
8GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం రూ. 46,999 ధరకు అమ్ముడవుతోంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇందులో 50MP ప్రైమరీ లెన్స్, 8MP అల్ట్రావైడ్ షూటర్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం 32MP లెన్స్ కూడా ఉంది..
