Google Drive
Google Drive for Desktop: గూగుల్ డ్రైవ్ ను మొబైల్ లో, వెబ్ ఇంటర్ఫేస్ లో వాడని వారుండరు. కానీ, డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్ కూడా అందుబాటులో ఉందని తెలుసా. అది విండోస్ అయినా మ్యాక్ సిస్టమ్ అయినా గూగుల్ డ్రైవ్ వాడేసుకోవచ్చు. చివరిసారిగా నాలుగేళ్ల క్రితం అప్ డేట్ అయిన గూగుల్ డ్రైవ్ డెస్క్ టాప్ సాఫ్ట్ వేర్ మళ్లీ మారింది.
ప్రస్తుతమున్న టూల్స్ ను రీప్లేస్ చేసి.. కొత్తవి ఇన్‌స్టాల్ చేశారు. మొబైల్‌లో లేదా వెబ్‌లో వాడుకోవడం కామన్‌యే. కానీ, డెస్క్ టాప్ లో కూడా మన డేటా ఉంచుకోవడానికి గూగుల్ డ్రైవ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. కొద్ది వారాల తర్వాత గూగుల్ బ్యాకప్, సింక్రనైజేషన్ కు ప్రాంప్ట్ పంపుతుంది. అలా మీ డెస్క్ టాప్ పై సేవ్ చేసిన ఫైల్స్ ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు.
ఇది ఎలా ఇన్‌స్టాల్ చేయాలంటే..
విండోస్ మెయిన్ Settings ఓపెన్ చేయండి. అందులో Apps, Apps & featuresను ఎంచుకోండి. అక్కడకు వెళ్లి ప్రోగ్రాంను అన్ ఇన్ స్టాల్ చేసేయండి. మ్యాక్ ఓఎస్ లో అయితే యాప్ ను డ్రాగ్ చేసి ఐకాన్ ను ట్రాష్ లో వేసేయండి. ఇక చేయాల్సిందే కొత్త గూగుల్ డ్రైవ్ ఇన్‌స్టాల్ చేయడమే.
ఇప్పటివరకూ కొత్త గూగుల్ డ్రైవ్ ఎక్కడ దొరుకుతుందని గూగుల్ చెప్పలేదు. కానీ, గూగుల్ బ్లాక్ విండోస్, మ్యాక్ ఓఎస్ వెర్షన్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత గూగుల్ అకౌంట్ లోకి సైన్ ఇన్ చేయాలి. కావాల్సిన ఫైల్ ను అప్ లోడ్ చేస్తే క్లౌడ్ సింబల్ కనిపిస్తుంది. మీకు బ్లూ కలర్ లో క్లౌడ్ సింబల్ కనిపిస్తే అది లోకల్ లో మాత్రమే సేవ్ అవలేదని అర్థం. క్లౌడ్ సింబల్ లేకుండా ఉన్న ఫైల్ ఓపెన్ చేసినా అవి కంప్యూటర్ లో వాడుకోవడం కోసమే. చూడటం, ఎడిట్ చేసుకోవడం వంటివి చేయొచ్చుకానీ, అవి గూగుల్ డ్రైవ్ లో అప్ లోడ్ అయినట్లు కాదు.
అలా మీకు కావాల్సిన ఫైల్స్ ను ఆన్ లైన్, ఆఫ్ లైన్ యాక్సెస్ తో ఓపెన్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ ఆప్షన్లు కావాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్లి డ్రైవ్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఏరియాలో ప్రిఫరెన్స్ మార్చుకోవాలి.