Tesla Smartphone : టెస్లా నుంచి గేమింగ్ ఫీచర్లతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంత ఉండొచ్చుంటే?

టెస్లా గేమింగ్ టెక్నాలజీతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అతి త్వరలో టెస్లా నుంచి గేమింగ్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Tesla Smartphone : స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి టెస్లా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఎలక్ట్రిక్ కార్లతో గ్లోబల్ మార్కెట్లో రారాజుగా పేరొందిన టెస్లా గేమింగ్ టెక్నాలజీతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ పేరుతో అంతరిక్ష పరిశోధన సంస్థను స్థాపించారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలోకి అడుగుపెట్టేందుకు మస్క్ ప్లాన్ చేస్తున్నారట.. అతి త్వరలో టెస్లా నుంచి గేమింగ్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. టెస్లా స్మార్ట్ ఫోన్ ఎలా ఉండబోతున్నాయనేది మార్కెట్ వర్గాల్లో హట్ టాపిక్ గా మారింది. టెస్లా తీసుకురాబోయే కొత్త స్మార్ట్ ఫోన్ ఎలా ఉండబోతోంది.. ఏయే ఫీచర్లు ఉంటాయి.. ఎప్పుడు మార్కెట్లో రిలీజ్ చేస్తారు అనే చర్చ మొదలైంది.. ఇంతకీ టెస్లా లాంచ్ చేయబోయే ఆ స్మార్ట్ ఫోన్ ఏంటి? దాని ఫీచర్లు, ధర ఎంతవరకు ఉండొచ్చు అనే వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Tesla smartphone Model Pi/P :
టెస్లా నుంచి గేమింగ్ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్‌ వస్తోంది.. ఈ ఫోన్ మోడల్‌ (Model Pi/P).. స్మార్ట్ ఫోన్ రాకపై టెస్లా కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. Model Pi/P పేరుతో టెస్లా గేమింగ్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుందని టెక్ వర్గాలు వెల్లడించాయి. టెస్లా కంపెనీ నుంచి చాలావరకూ ప్రొడక్టులు మార్కెట్లోకి వచ్చాయి. అందులో cyber-truck, పిల్లల కోసం electric vehicles, Tesla umbrella, స్టీల్ విజిల్ (stainless steel whistle) వంటివి లిస్టులో ఉన్నాయి. టెస్లా స్మార్ట్‌ఫోన్‌ను కూడా ఇది మాదిరిగా మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని మొబైల్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tesla phone features and specs :
టెస్లా స్మార్ట్ ఫోన్ కు సంబంధించి రుమర్ల ప్రకారం.. రాబోయే టెస్లా స్మార్ట్ ఫోన్ గేమింగ్ ఫీచర్స్‌తో లాంచ్ కానుంది. ఫోన్‌ వెనుకవైపు టెస్లాకు గుర్తుగా ‘T’ అక్షరం లోగో ఉండనుంది. అలాగే ఫోన్‌‌పై భాగంలో నేవీ బ్లూ కలర్‌, కింద స్కై బ్లూ కలర్స్ తో రానుంది. ఫోన్‌లో 108MP ప్రైమరీ కెమెరా, మరో రెండు క్వాలిటీ కెమెరాలు వస్తాయట.. స్నాప్‌డ్రాగన్‌ 898 ప్రాసెసర్‌తో ఈ ఫోన్‌ రన్ అవుతుంది. 6.5 అంగుళాల 4K రిజల్యూషన్ డిస్‌ప్లే ఉండనుంది. 2TB ఇంటర్నల్‌ స్టోరేజీతో రానుంది. ఫోన్ ర్యామ్‌, OS వివరాలు రివీల్ చేయలేదు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఈ ఫోన్‌ ఉందని, వచ్చే ఏడాది 2022లో మార్కెట్లోకి రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Tesla smartphone price :
ఎలన్ మస్క్ టెస్లా కంపెనీ నుంచి సరికొత్త గేమింగ్ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ రాబోతోంది. అయితే ఈ టెస్లా స్మార్ట్‌ఫోన్‌ ధర 800 డాలర్ల నుంచి 1,200 డాలర్ల మధ్య ఉంటుందని అంచనా.. మన భారత కరెన్సీలో సుమారు రూ. 60 వేల నుంచి రూ. 90 వేల మధ్య ఉండొచ్చు..

ట్రెండింగ్ వార్తలు