Five new Apple products are coming soon in early 2025
2025 Apple Products : ప్రపంచ టెక్ దిగ్గజం, అమెరికా కంపెనీ ఆపిల్ వచ్చే ఏడాది పలు ప్రొడక్టులను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రాబోయే ఆపిల్ డివైజ్‌లలో స్మార్ట్ హోమ్ సొల్యూషన్‌లకు కొత్త ఐఫోన్‌లు, నెక్స్ట్ జనరేషన్ విజన్ ప్రో, ఎయిర్ పాడ్‌లు మొదలైనవి ఉన్నాయి.
ఆపిల్ ప్రొడక్టులకు ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉంటుంది. అందుకే ఆపిల్ కొత్త ఆఫర్లపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 2025లో ఆపిల్ తన కస్టమర్‌ల కోసం ఏయే ప్రొడక్టులను రిలీజ్ చేయనుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Read Also : iPhone 16 Discount : కొత్త ఐఫోన్ కావాలా? ఆపిల్ ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్.. డోంట్ మిస్..!
ఐఫోన్ SE 4 :
వచ్చే ఏడాది ఆపిల్ ఐఫోన్ SE 4ని లాంచ్ చేయనుంది. అందుబాటు ధరలో వస్తున్న ఈ ఐఫోన్ పాత మోడల్‌తో పోలిస్తే చాలా అప్‌డేట్‌లను అందించనుంది. ముఖ్యంగా ఛార్జింగ్ విషయంలో 6.1-అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫేస్ ఐడీ, యూఎస్‌బీ-సి పోర్ట్‌ను కలిగి ఉంటుంది. అలాగే, ఐఫోన్ 16లో కనిపించే A18 చిప్‌తో అమర్చి ఉంటుందని భావిస్తున్నారు.
ఐఫోన్ 17 సిరీస్ :
కొత్త ఆపిల్ ఐఫోన్ల కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. కంపెనీ ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబర్ 2025లో లాంచ్ చేయొచ్చు. ఐఫోన్ ప్రో, ఐఫోన్ ప్రో మాక్స్ మోడల్స్ కాకుండా, ఈసారి ఈ సిరీస్‌లో ఐఫోన్ 17 ఎయిర్‌ను లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇదే అత్యంత సన్నని ఐఫోన్. ఇప్పటివరకు అత్యంత పవర్‌ఫుల్ ఫీచర్లను రాబోయే ప్రో, ప్రో మాక్స్ మోడల్‌లలో కూడా అందించే అవకాశం ఉంది.
ఆపిల్ కమాండ్ సెంటర్ :
2025 సంవత్సరంలో చిన్నపాటి చతురస్రాకారంలో ఆపిల్ కమాండ్ సెంటర్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ స్మార్ట్ హోమ్ డివైజ్‌లను కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతుంది. దీంతో ఫేస్ టైమ్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ఆపిల్ డివైజ్ పరిమాణం 6 అంగుళాలు ఉంటుంది. ఒక రూమ్ నుంచి మరో రూమ్‌కు సులభంగా మూవ్ చేసేలా ఉంటుంది. ఈ ఆపిల్ డివైజ్ అందుబాటు ధరలోనే ఉంటుందని అంచనా.
2025 Five new Apple products
ఎయిర్‌పాడ్స్ ప్రో 3 :
వచ్చే 2025 సంవత్సరంలో (AirPods Pro)కి అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. కంపెనీ డిజైన్‌పై అప్‌గ్రేడ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఎయిర్‌పాడ్స్ (AirPods 4) మాదిరిగా ఈ రాబోయే ఎయిర్ పాడ్స్ ప్రో 3లో కూడా కొన్ని మార్పులు ఉండవచ్చుని అంచనా. హార్ట్ రేట్ ట్రాకింగ్, టెంపరేచర్ మానిటరింగ్ కూడా ఎయిర్ పాడ్స్ ప్రో3 మోడల్‌లో చూడవచ్చు.
నెక్స్ట్ జనరేషన్ ఆపిల్ విజన్ ప్రో :
కంపెనీ నెక్స్ట్ జనరేషన్ ఆపిల్ విజన్ ప్రోని 2025లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అత్యంత ఖరీదైన ధర కలిగిన ఈ విజన్ ప్రో డివైజ్ మార్కెట్లోకి మారడానికి ఒక అడ్డంకిగా మారిందని చెప్పవచ్చు. అలాంటి పరిస్థితిలో, కంపెనీ ఈ విజన్ ప్రో ధరను తగ్గించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. కంపెనీ యాపిల్ విజన్‌ను కూడా లాంచ్ చేయొచ్చు.
ఆపిల్ M4 మ్యాక్‌బుక్ ఎయిర్ :
ఆపిల్ అత్యంత ప్రజాదరణ పొందిన మ్యాక్ నెక్స్ట్ అప్‌గ్రేడ్‌ను అందించనుంది. 2025 ప్రారంభంలో కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్ నుంచి ఏయే ఫీచర్ల ఉండొచ్చుంటే?
మొత్తంమీద (MacBook Air) అద్భుతమైన డివైజ్, టైమింగ్ విషయానికొస్తే.. 2024 ప్రారంభంలో M3 మ్యాక్‌బుక్ ఎయిర్ లాంచ్ కానుంది. షెడ్యూల్ ప్రకారం మార్చిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Read Also : Apple iPhone 15 Pro : ఆపిల్ ఐఫోన్ 15ప్రోపై బిగ్ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?